- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు ఊహించని షాక్.. కేసీఆర్‌పై పోరుబాటకు సిద్ధమైన పార్టీ అనుబంధం విభాగం..!
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న అధికార బీఆర్ఎస్ పార్టీలో అనుబంధ విద్యార్థి సంఘాల నేతలు గళమెత్తడం హాట్ టాపిక్ గా మారింది. అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై పోరుబాట పట్టడం చర్చనీయాశంగా మారింది. తెలంగాణ పోరాటంలో ముందుండి త్యాగాలు చేసిన కాకతీయ యూనివర్సిటీ ఉద్యమ నేతలకు కేసీఆర్ ప్రభుత్వం మొండి చేయి చూపుతోందని.. టికెట్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఓయూ ఉద్యమకారులకు కల్పించిన అవకాశం కేయూ ఉద్యమకారులకు ఇవ్వడం లేదని కాకతీయ విద్యార్థి ఉద్యమకారులు ఫైర్ అయ్యారు. మంగళవారం హన్మకొండలోని హరిత హోటల్‌లో వీరంతా సమావేశమై పార్టీ పెద్దల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకే ప్రభుత్వం పట్టం కడుతోందని.. ఇన్నాళ్లు ఓపిక పట్టి స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు, ప్రజాప్రతినిధులకు సహకరిస్తున్నా తమకు అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిసారి జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి విద్యార్థి సంఘాలతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన మమ్మల్ని ప్రభుత్వం, పార్టీ పట్టించుకోవడం లేదంటూ గత కొంతకాలంగా కేయూ విద్యార్థి ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి భేటీ అయి తమ విషయంలో కేసీఆర్, కేటీఆర్ న్యాయం చేయకుంటే నవంబర్‌లో పోరుబాట పడతామని డెడ్ లైన్ విధించారు. ఈ సందర్భంగా బహిరంగ సభను సైతం ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు.