- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిషేధాజ్ఞలు వెంటనే ఎత్తివేయాలి.. లేకుంటే ఓయూ అగ్నిగుండమే: BRSV

దిశ, తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలో ఎలాంటి ఆందోళనలు చేయొద్దని రిజిస్టర్ ఆదేశాలు జారీచేయడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని అవమాన పరచడమే అని.. ఆ నిషేధాజ్ఞలను వెంటనే తొలగించాలని బీఆర్ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పడాల సతీష్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. లేదంటే ఓయూ అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ అయిన ఉస్మానియాలో నిషేధాజ్ఞలు విధిస్తే మేధావులమని చెప్పుకునే ప్రజాగొంతుకలు ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని రావనకాష్టంగా మారుస్తున్న తెలంగాణ ద్రోహి రేవంత్ అసెంబ్లీలో పరుష పదజాలంతో మాట్లాడుతుంటే మేధావితనం ఎక్కడ పోయిందని నిలదీశారు. తెలంగాణ సాధకుడు, జాతిపిత కేసీఆర్‌ను స్ట్రైచర్, మార్చురీ అని అంటే ప్రజలు ఉక్రోశానికి లోనవుతున్నారని తెలిపారు. 2014 తరవాత కేసీఆర్ తెలంగాణను దేశంలో నెంబర్ వన్ చేస్తే, ఈ ఓటుకు నోటుకు దొంగ దశబ్ద కాలం పాటు వెనక్కి తీసుకెళ్లారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతులను గుడ్డలూడదీసి కొడుతా అని అసెంబ్లీ సాక్షిగా 20శాతం కమిషన్ రెడ్డీ అంటుంటే ప్రొఫెసర్ కోదండ రామ్ ఎక్కడ పోయారని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. యూనివర్సిటీలో ఆంక్షలు తీసేసి, అభివృద్ధిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.