KTR: సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌస్ రాసిస్తా.. కేటీఆర్ సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |
KTR: సీఎం రేవంత్‌కు ఫామ్‌హౌస్ రాసిస్తా.. కేటీఆర్ సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: జోసెఫ్ గోబెల్స్‌(Joseph Gobels)ను ఆదర్శంగా తీసుకుని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రులు పనిచేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR) విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్(Congress) అధికారంలోకి వచ్చి సంవత్సరం అయింది. సంవత్సరం కాలంలో బీఆర్ఎస్(BRS) అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి, కేసీఆర్(KCR) అనారోగ్యం, కవిత(Kavitha) జైలుకు వెళ్లడం, పది మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. అయినా బీఆర్ఎస్(BRS) తట్టుకుని నిలబడిందని కేటీఆర్(KTR) అన్నారు. తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్‌గా మారిందని తెలిపారు. మరో నాలుగేళ్లు బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని సూచించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో లక్ష కోట్ల అప్పులు, ప్రజల తిప్పలు అని సెటైర్ వేశారు.

బీఆర్ఎస్ హయాంలో అప్పులు జరిగాయంటూ సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. సీఎం తప్పులపై చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన సోదరులకే లాభం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడులు పెట్టే స్థాయికి ఆయన కుటుంబం ఎదిగిందని చెప్పుకొచ్చారు. ఫోర్బ్స్ జాబితాలో రేవంత్ రెడ్డి కుటుంబం ఉంటుందేమో చూడాలని అన్నారు. తరచూ రాష్ట్రం దివాళా తీసిందని రేవంత్ రెడ్డి పరువు తీస్తున్నారని మండిపడ్డారు. అసలు తెలంగాణ ఎందులో రైజింగ్‌లో ఉండో చెప్పాలని సవాల్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తన ఖాతాలో వేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి విలువలు ఉండవని.. డబ్బు సంచులతో దొరికిన దొంగ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎంతో పాటు మంత్రులకు కూడా అవగాహన లేదని విమర్శించారు. 2023లో రెవెన్యూ మిగులు రూ.5944 కోట్లుగా ఉందని చెప్పారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల ఫామ్‌హౌస్ ఉంటే చూపించాలని.. నిరూపిస్తే అది రేవంత్‌కే రాసిస్తా అని కీలక ప్రకటన చేశారు.

Advertisement

Next Story

Most Viewed