KTR : ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే : పోలీసులకు కేటీఆర్ వార్నింగ్

by Rani Yarlagadda |
KTR : ఇదేనా ఇందిరమ్మ రాజ్యమంటే : పోలీసులకు కేటీఆర్ వార్నింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వం దళితబంధు (Dalitha Bandhu) డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. హుజూరాబాద్ లో ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని (MLA Koushik Arrest) పోలీసులు అడ్డుకున్నారు. రైతులు, బీఆర్ఎస్ నేతలు భారీగా చేరుకోగా అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని బలవంతంగా పోలీస్ వెహికల్ లోకి ఎక్కించారు. ఆయన్ను బలవంతంగా కారులోకి నెట్టడంతో గాయమై, స్పృహ కోల్పోయారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై దాడి చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని ఫైరయ్యారు. రాష్ట్రంలో పోలీసులు కూడా ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక పోలీసులకు వడ్డీతో సహా చెల్లిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కక్ష కట్టారని, అరికెపూడి గాంధీతో దాడి చేసే ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

Advertisement

Next Story

Most Viewed