- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని ఓడించేది కూడా బీఆర్ఎస్సే’
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలోని పెద్ద నేతలను సైతం ఓడించింది బీఆర్ఎస్ పార్టీనే అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గురువారం జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ కార్యకర్తలతో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది.. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేతలను ఓడించింది బీఆర్ఎస్ అభ్యర్థులే అని కాంగ్రెస్‌కు కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కూడా ఓడించేది బీఆర్ఎస్సేనని కేటీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఏం తీసుకురాలేదని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయనని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
కాగా, గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కీలక నేతలు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. టీ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్ కరీంనగర్‌లో గంగుల చేతిలో ఓటమి పాలు కాగా.. ఈటల రాజేందర్ కేసీఆర్, కౌశిక్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. దుబ్బాకలో రఘునందన్ రావు కొత్త ప్రభాకర్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. మరో బీజేపీ కీలక నేత ధర్మపురి అర్వింద్ కోరుట్లలో బీఆర్ఎస్ క్యాండిడేట్ డాక్టర్ సంజయ్‌పై పోటీ చేసి ఓడిపోయారు.