BRS ఓటు బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్.. కురియన్ కమిటీ ముందు అభ్యర్థుల క్లారిటీ

by Rajesh |
BRS ఓటు బ్యాంక్ బీజేపీకి షిఫ్ట్.. కురియన్ కమిటీ ముందు అభ్యర్థుల క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ బీజేపీకి షిప్ట్ అవడం వలన, పార్టీ పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోయామని ఓడిపోయిన అభ్యర్ధులు, సిట్టింగ్ ఎంపీలు కురియన్ కమిటీకి వివరించారు. అందరి నోటా ఇదే రీజన్ వెలువడినట్లు తెలిసింది. గురువారం గాంధీభవన్ లో కమిటీ లీడ్ కురియన్ అధ్యక్షతన జరిగిన సమీక్షలో మెంబర్లు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్ లు పాల్గొన్నారు. లోక్ సభ ఎన్నికలపై ఆరా తీశారు. మొదట సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్ధి దానం నాగేందర్ తన ఓటమిపై వివరణ ఇచ్చారు. ఆ తర్వాత ఒక్కో పార్లమెంట్ ఎంపీ అభ్యర్ధులు వరుసగా వచ్చి కమిటీ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ ఈ మీటింగ్ కు హాజరు కాలేదని సమాచారం. ఎంపీ అభ్యర్ధులు, ఎంపీలు ఇచ్చిన వివరణను కురియన్ కమిటీ నోట్ చేసుకున్నది. ఈ రోజు నుంచి ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యనేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. రెండు రోజుల పాటు జరిగే ఛాన్స్ ఉన్నదని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఈ రెండింటినీ బేరీజు చేసుకొని, కురియన్ కమిటీ హైకమాండ్ కు ఓ రిపోర్టు ఇవ్వనున్నది. ఆ తర్వాత బీజేపీకి చెక్ పెట్టేందుకు ఏఐసీసీ రాష్ట్ర పీసీసీకి నిర్ధిష్టమైన ప్రణాళికను పంపించనున్నది. రాష్ట్రంలో 14 సీట్లు టార్గెట్ పెట్టుకోగా, కనీసం 12 సీట్లైనా గెలవాల్సి ఉన్నదంటూ కమిటీ ఎంపీలు, అభ్యర్ధులను పదే పదే ప్రశ్నించినట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed