'తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే'

by Vinod kumar |
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ యూఎస్ఏ అడ్వైజ‌రి బోర్డు చైర్మన్ తన్నీరు మహేష్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్-యూఎస్ఏ ఆధ్వర్యంలో కొలంబస్ నగరంలో జాతీయ సదస్సు మంగళవారం నిర్వహించారు. 50 రాష్ట్రాల నుంచి బీఆర్ఎస్- యూఎస్ఏ ప్రతినిధులు పాల్గొనగా బీఆర్ఎస్ ఏర్పడిన తర్వాత అమెరికాలో ఇది తొలి జాతీయ సదస్సు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ దూర దృష్టి, ఆలోచన, ప్రణాళిక, నిబద్ధతకు నిదర్శనం అన్నారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణలు, రైతు బంధును ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్నాయన్నారు. ఐటీ రంగంలో పెట్టుబడులు మంత్రి కేటీఆర్ సమర్థ నాయకత్వంతో వస్తున్నాయని, టీ-హబ్ ప్రపంచంలో అతిపెద్ద ఇంక్యూబేటర్ అని, టీ- వర్క్స్ ఆవిష్కర్తలకు, చిన్న, మధ్యతరహా సంస్థలకు దేశంలో అతిపెద్ద నమూనా మరియు ప్రాథమిక రూప కల్పన కేంద్రం అన్నారు. డేటా సెంటర్ పాలసీ కలిగి ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

టీఎస్ ఐపాస్ ద్వారా 15 రోజుల్లో కంపెనీలు స్వీయ ధ్రువీకరణ చేసుకోగలిగిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ - యూఎస్ఏ ను అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో బలోపేతం చేయడం, సమావేశాలకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఎన్నారైలను ఆహ్వానించడం, వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధి మరియు తెలంగాణ నమూనాకు సంబంధించిన వీడియోలను వివిధ భారతీయ ప్రాంతీయ భాషల్లోకి అనువదించడం లాంటి కార్యక్రమాల చేపట్టాలని, తెలంగాణ మోడల్ గురించి వివరించాలని కార్యకర్తలకు సూచించారు.

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్-యుఎస్ఏ కార్యకర్తల పాత్ర కీలకమని అనంతరం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాలను సభ్యులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో అటోర్నీ వినీత మెహ్రా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ అసోసియేషన్స్ అధ్యక్షుడు అరిందమ్ గుహ, బ్లూ ఆష్ సిటీ కౌన్సిల్ వైస్ మేయర్ ప్రమోద్ ఝవేరి, బీఆర్ఎస్-యూఎస్ఏ కన్వీనర్లు పూర్ణ బైరి, చందు తాళ్ల, నరసింహ నాగులవంచ, అరవింద్ తక్కళ్లపల్లి, నాయకులు రజినీకాంత్ కూసానం, వేణు పామేర, డేవిడ్ విక్రమ్, రామకృష్ణ కాసర్ల, విష్ణు, సుధాకర్, శ్రీనివాస్ ఆకుల, శ్రీధర్ బిల్లకంటి, అశోక్ ఎల్లందుల, అమర్ రెడ్డి, సాజిత్ దేశినేని, అడ్వైసర్ రవి ధన్నపునేని, బిందు చీదెళ్ల, డల్లాస్ నుండి శ్రీనివాస్ సురభి,మనోజ్ ఇనగంటి, శ్రీకాంత్ పీచర, దేవేందర్ చిక్కాల, గిరిధర్ వీరమనేని, శశి దొంతినేని, ఆస్టిన్ నుండి హరీష్ రెడ్డి వ్యాల్ల, శ్రీనివాస్ పొన్నాల న్యూ జెర్సీ నుండి మహేష్ పొగాకు, శ్రీనివాస్ జక్కిరెడ్డి, వాషింగ్టన్ డీసీ నుండి అనిల్ కాశినేని, కిషోర్. అట్లాంటా నుండి శ్రీధర్ జూలపల్లి, రంజిత్ కోదాటి ఫ్లోరిడా నుండి టోనీ జన్ను, కాలిఫోర్నియా నుండి రాజ్ భవాని, శివ కాలేరు, డెట్రాయిట్ నుండి అనిల్ దొంతినేని, వెంకట్ మంతెన డెలావేర్ నుండి భాస్కర్ పిన్న చికాగో నుండి మహిపాల్ రెడ్డి, ప్రశంష్ సియాటిల్ నుండి గణేష్ యూత్ కమిటీ నాయకులు అభిషేక్ కొత్తూర్, ఉదయ్ యాదవ్, కిషోర్, శరన్ దొంతినేని, కార్తీక్ రంగినేని, సంతోష్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed