బడ్జెట్ రోజే బీఆర్ఎస్ టూర్.. గులాబీ బాస్ మరో సంచలన నిర్ణయం

by Prasad Jukanti |
బడ్జెట్ రోజే బీఆర్ఎస్ టూర్.. గులాబీ బాస్ మరో సంచలన నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: అసెంబ్లీ వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ప్రణాళికలు రచిస్తున్న గులాబీబాస్ కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 25,26 తేదీలలో బీర్ఎస్ బృందాన్ని కాళేశ్వరం టూర్ కు పంపించాలని డిసైడ్ చేశారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్ఎల్పీ భేటీ వివరాలను ఆ పార్టీ ఎమ్మెల్యే హరీశ్ రావు మీడియాకు వివరించారు. ఈనెల 25, 26వ తేదీలలో రెండు రోజుల పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మేడిగడ్డ, కన్నెపల్లిని సందర్శిస్తామని తెలిపారు. ఈ నెల 25వ తేదీన బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టిన అనంతరం అదే రోజు మధ్యాహ్నం కాళేశ్వరం టూర్ కు వెళ్లాలని నిర్ణయించామన్నారు. ప్రాజెక్టులన్ని ఖాళీగా ఉన్నప్పటికీ కాళేశ్వరం పంపు హౌస్ ల ద్వారా నీళ్లను లిఫ్ట్ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఈ విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు కేసీఆర్ ఆదేశాలతో తాము ఈ సందర్శనకు వెళ్లబోతున్నామన్నారు.

విద్యార్థులు, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, వారి అక్రమ అరెస్టులపై రేపు సభలో వాయిదా తీర్మానం పెట్టబోతున్నట్టు వెల్లడించారు. రైతు రుణమాపీ, రైతు భరోసా విషయంలో రైతులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నది. రైతుల పక్షాన ప్రభుత్వం పోరాటం చేయాలని నిర్ణయించాం. ఫీజు రీయింబర్స్ మెంట్ పై పోరాటం చేస్తామన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం వదిలిపెట్టిన బకాయిలను తమ ప్రభుత్వం చెల్లించిందన్నారు. రూ. 4 వేల పెన్షన్లు, లా అండ్ ఆర్డర్, ఒవర్సీస్ స్కాలర్ షిప్, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వెంటనే నిర్ణయం తీసుకోవాలని, ఎవరెవరూ ఏయే అంశాలపై మాట్లాడాలో కేసీఆర్ సభ్యులకు దిశానిర్దేశం చేశామన్నారు

వడ్ల అమ్మకంలో వందల కోట్ల కుంభకోణం:

వడ్ల అమ్మకంలో వందల కోట్ల పెద్ద కుంభకోణం జరిగిందని.. ఈ అవినీతి వెనుక ఉన్న అదృశ్య శక్తులు ఎవరు అనే పూర్తి సమాచారం మా వద్ద ఉందని హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సివిల్ సప్లై కుంభకోణంతో పాటు రాష్ట్రంలో ఎక్సైజ్ కుంభకోణం జరిగిందని, ఇతర రాష్ట్రాల్లో బ్యాన్ చేసిన సోమ్ డిస్టరరీని మన రాష్ట్రంలో ఎలా అనుమతి ఇచ్చారన్నారు. ఈ కుంభకోణాల బండారం మొత్తం అసెంబ్లీ వేదికగా బట్టబయలు చేస్తామని చెప్పారు. కేసీఆర్ అధ్యక్షత దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున అనుసరించాల్సిన వ్యూహాలను అధినేత కేసీఆర్ సభ్యులకు దిశానిర్దేశం చేశారని వెల్లడించారు. బడ్జెట్ లో తెలంగాణకు ఒక్క ప్రాజెక్టును తీసుకురావడంలో రేవంత్ రెడ్డి విఫలం అయ్యారని తెలంగాణకు జరిగిన అన్యాయంపై లోక్ సభలో రాహుల్ గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story