- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS: తల్లికి బువ్వ లేదు, చిన్నమ్మకు బంగారు గాజులా..! మాజీమంత్రి కేటీఆర్ సెటైర్లు
దిశ, వెబ్ డెస్క్:తల్లికి బువ్వ పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయించాడట! అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) సెటైర్లు(Satairs) వేశారు.మాగునూరు(Magnoor Incident) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అస్వస్థత అని వచ్చిన వార్తలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ సందర్భంగా.. విద్యార్థులకు పరిశుభ్రమైన ఆహారం అందించలేని రేవంత్.. మహిళలను కోటీశ్వరులను చేస్తాడట! అని ఎద్దేవా చేశారు.
అలాగే రోజుకో గురుకుల పాఠశాలలో ఆహారం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారని, ఎన్నడూ లేనిది గురుకుల పాఠశాలలలో ఇప్పటి వరకు 40 మందికి పైగా విద్యార్థులు మరణించారని వ్యాఖ్యానించారు. అంతేగాక పిల్లలు పిట్టల్లా రాలుతుంటే దిద్దుబాటు చర్యలు తీసుకోకుండా వేదికల మీదికెక్కి పిట్టలదొర మాటలు చెబుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక దవాఖానల్లో విద్యార్థులు(Students In Hospitals).. చెరసాలలో రైతన్నలు(Farmers In Jail).. ఆందోళనలో నిరుద్యోగులు( Unemployed In Agitation) ఉన్నారని చెబుతూ.. జాగో తెలంగాణ అని కేటీఆర్ ఎక్స్ లో రాసుకొచ్చారు.