- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS సర్కార్ అవినీతిని త్వరలో ఆధారాలతో బయటపెడుతా.. : RSP
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ సర్కార్.. నేతల అవినీతి చిట్టా ఆధారాలతో సహా త్వరలోనే బయట పెడుతానని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు, అధికారుల అవినీతి బయటపడుతుందన్న భయంతోనే సీఎం కార్యాలయంలో మాజీ ఐఏఎస్ సోమేశ్ కుమార్‌ను ప్రధాన సలహాదారుడిగా నియమించారని ఆర్ఎస్పీ విమర్శించారు. శనివారం ఆయన బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేవలం ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగమే బీసీ కులాల చేతివృత్తులు, కులవృత్తులకు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేస్తామని కేసీఆర్ ప్రకటించడం బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.
నాయి బ్రాహ్మణ, రజక కుల వృత్తిదారులకు సెలూన్, దోబీ ఘాట్‌లు, లాండ్రీ దుకాణములు నడిపేందుకు గా 250 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎందుకు అమలుకు నోచుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణ, రజక వృత్తిదారులకు చెల్లించే విద్యుత్ బకాయిలు చెల్లించడం లేద్దన్న ఆయన బీసీల సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు. రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్‌ల ద్వారా ఎంతమంది బీసీలకు రుణాలు మంజూరు చేశారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే మంత్రివర్గ ఉప సంఘాలు ఏర్పాటు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో గద్దెదించాలని విమర్శించారు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యలు, ధరణి పోర్టల్, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, అక్రమ లేఅవుట్లు, ప్లాట్లు, గ్రామకంఠం భూముల క్రమబద్ధీకరణకు వేసిన మంత్రివర్గ ఉపసంఘాలు సిఫార్సులను ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
అర్హులైన ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నిషేధిత జాబితాలో ఉన్న లక్షల ఎకరాల అసైన్డ్ భూములను వెంటనే తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా రియల్టర్ల చేతిలో హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న 3,000 చెరువులు ధ్వంసం అయ్యాయాని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరిట ప్రభుత్వం పేద ప్రజల దగ్గర నుంచి వేల ఎకరాల భూములను గుంజుకొని కేవలం వంద గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి పేదలకు పేదలను అన్యాయానికి గురిచేస్తుందని అన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్షమాపణలు చెప్పాలి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ దళితులు, థర్డ్ క్లాస్ అని చేసిన వాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, దళితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల మీద దాడులు, నిషేధం విధించడాన్ని బీఎస్పీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల ముందు బీఎస్పీలో చేరేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నాయకులు సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.
Also Read..