సస్పెండ్ చేసి.. మళ్ళీ న్యాయం చేయాలనేది మీరే! బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh N |
సస్పెండ్ చేసి.. మళ్ళీ న్యాయం చేయాలనేది మీరే! బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నా జాబ్ పోయింది.. మాది రేవంత్ రెడ్డి పటేల్‌ వాళ్ళ ఊరు.. పటేల్‌ని కలుద్దాం అని వస్తే ఇంటి దగ్గరికి కూడా రానిస్తలేరంటూ ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ట్విట్టర్ వేదికగా స్పందించింది. మహబూబ్‌నగర్ జిల్లా వెల్దండ పోలీస్ స్టేషన్ లో పనిచేసే పుష్పలత అనే మహిళ, శ్రీహరి అనే హోంగార్డు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని గతంలో అధికారులు తొలిగించారని పేర్కొంది. అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లోనే విచారణ చేసిన అధికారులు వారిని విధుల నుంచి తొలగించారని స్పష్టం చేసింది. ఇప్పటికైనా మీ హయాంలో జరిగిన తప్పులను ఒప్పుకుంటున్నందుకు సంతోషమని సెటైర్లు వేసింది. 2015 నుంచి 2023 వరకు మీరు ఆ ఇద్దరికీ న్యాయం చేయలేదని మీరే ఒప్పుకున్నారన్నారు.

మీరు సస్పెండ్ చేసి విధుల నుంచి తొలగించి వారికి అన్యాయం చేశారన్నారు. 2015 నుంచి 2023 వరకు వారిని మీరు పట్టించుకోలేదని, న్యాయం చేయలేదని, ఈరోజు వారిపై మీరే మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని విమర్శించారు. మీరే వారికి అన్యాయం చేసి వాళ్లకి అన్యాయం జరిగింది.. న్యాయం చేయాలని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమస్య ఉందని ఎవరైనా కలవడానికి వస్తే సహాయం చేయాలని ప్రయత్నం చేస్తారని, విచారణ జరిపించి న్యాయం చేయాలని చూస్తారని స్పష్టం చేసింది. తప్పు చేసిన వాడు తనవాడైనా, తన ప్రాంతం వాడైనా ధర్మం తప్పు చెప్పకూడదు అనే నాయకుడు తమ సీఎం రేవంత్ రెడ్డి‌ని బదనాం చేయడం మానేసి.. మీరు చేసిన అవినీతి కుంభకోణాల పాపాలకు పరిహారం త్వరలోనే పొందేందుకు సిద్ధంగా ఉండండని స్పష్టం చేసింది.

Advertisement

Next Story