BRS: రైతుబంధును ఆపింది రేవంత్ రెడ్డే.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: రైతుబంధును ఆపింది రేవంత్ రెడ్డే.. మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రైతు బంధును ఆపింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనని, గతంలో చేసిన వ్యాఖ్యాలపై సీఎం ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు(BRS Leader Harish Rao) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy)పై విమర్శల వర్షం గుప్పించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో మూడు పంటలకు రైతు బంధు ఇవ్వాలన్న రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఉన్న రైతుబంధు(Raithu Bandhu) కూడా ఇవ్వట్లేదని అన్నారు. రైతుబంధు, రైతు భీమా(Raithu Bheema) ద్వారా కేసీఆర్.. రైతులకు 82 వేల కోట్లు ఇచ్చారని తెలిపారు. కౌలు రైతుల సమస్యలపై.. రైతు, కౌలు రైతు ఇద్దరు మాట్లాడుకోవాలని సీఎం, మంత్రి అంటున్నారని ఎద్దేవా చేశారు. అలాగే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బతుకమ్మ చీరను ఎగ్గొట్టిందని, పండుగ పూట మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. గతంలో ఎల్ఆర్ఎస్(LRS) విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)పై ఆరోపణలు చేశారని.. ఇప్పుడు 15 వేల కోట్లు కట్టించాలని అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారని, పేదలపై ప్రేమ ఉంటే ఎల్ఆర్ఎస్ ను ఉచితం చేయాలని చెప్పారు.

గతంలో పరీక్షలు వాయిదా వేయాలని నిరసనలు తెలిపిన వీళ్లు.. ఇప్పుడు పరీక్షలు(Exams) వాయిదా వేయాలని నిరుద్యోగులు అడుగుతుంటే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. అంతేగాక గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వే చేస్తే ఆరోపణలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) చేస్తున్న సర్వే ఎలా ఉందో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. నాడు ఏక్ పోలీస్(Ek Police) విధానం అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు నో పోలీస్(No Police) అంటున్నారని, వారి నిరసలను కూడా పట్టించుకోవడం లేదని విమర్శలు చేశారు. ఇక గతంలో మద్యంపై లేనిపోని మాటలు మాట్లాడి, ఇప్పుడు మద్యం తాగుడులో మనమే ఫస్ట్ అని చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. కూల్చివేతలపై గతంలో అన్యాయం అని చెప్పిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు మాపై ఘోరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం(Kaleshwaram)పై సీఎం ఒక మాట మాట్లాడితే.. మంత్రి ఇంకోరకంగా మాట్లాడుతున్నారని తెలిపారు. ఇక రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలపై ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed