- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గద్దర్ మా వాడే..! బీఆర్ఎస్ క్రెడిట్ పాలిటిక్స్? ప్రగతి భవన్ మచ్చను తొలగించే యత్నం
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా యుద్దనౌక గద్దర్‌ను గుర్తిస్తూ ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకు సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్‌లో విగ్రహ ఏర్పాటుకు భూమి కేటాయించిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నంది అవార్డులకు గద్దర్ పేరు పెడుతామని ప్రకటించారు. ఈ క్రమంలోనే గద్దర్ వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకుంటుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. దీంతో గద్దర్ మా వాడే అంటూ క్రెడిట్ పాలిటిక్స్‌కు తెరలేపినట్లు కన్పిస్తుంది.
ప్రగతి భవన్ ముందు ఎండలో కూర్చోబెట్టి!
గద్దర్ చనిపోక ముందు గత సీఎం కేసీఆర్‌ను కలిసేందకు రెండు సార్లు ప్రయత్నించారని, అయిన కేసీఆర్ పర్మిషన్ ఇవ్వకుండా 3 గంటలు ప్రగతి భవన్ గేటు ముందు ఎండలోనే కూర్చోబెట్టి అవమానించారని ఆరోపణలు వచ్చాయి. మరోవైపు గద్దర్‌కు కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి సన్నిహితంగానే ఉంది. గద్దర్ చనిపోయినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ కుటుంబానికి అండగా నిలిచారు. అప్పటి ప్రభుత్వం సైతం గద్దర్ అంత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిపింది. అసెంబ్లీ ఎన్నికల్లో సైతం గద్దర్ కూతురుకు టీ కాంగ్రెస్ టికెట్ కూడా కేటాయించింది.
మచ్చను తొలగించేందుకు బీఆర్ఎస్ యత్నం!
ప్రగతి భవన్ ముందు ఎండలో కూర్చోబెట్టి ఘటన ఆరోపణలు.. ఆ మచ్చను తొలగించుకునేందుకు తాజాగా బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ గద్దర్ మంచి మిత్రులని కేసీఆర్ మొదటిసారిగా సీఎం అయినప్పటి వీడియోలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేశాయి. ఆ వీడియోలో గద్దర్, కేసీఆర్ పక్కనే కూర్చుని మీడియాతో మాట్లాడుతున్న సందర్భం. ఇది వారి స్నేహం అంటూ పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి.
గద్దర్ అన్నను ఎవరు మిస్ గైడ్ చేశారో..
ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఓ ప్రముఖ చానల్‌లో గద్దర్ గురించి మాట్లాడారు. ‘గద్దర్ అన్నను ఎవరు మిస్ గైడ్ చేశారో.. గద్దర్ అన్న కేసీఆర్‌ను కాలవాలనుకుంటే వందకు వంద శాతం ప్రగతి భవన్ ద్వారాలు తెరిచే ఉంటాయి. ప్రగతి భవన్‌కు ముందు ఆయన కుర్చున్నారనేది కేసీఆర్‌ను బద్నాం చేయడానికే. దళిత బంధు కార్యక్రమం సమయంలో గద్దర్ చేత ప్రారంభించాలని అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్‌ని కేసీఆర్ పంపితే గద్దర్ రాలేదు. నా దగ్గర ఆ ఫోటోలు ఉన్నాయి’ అని రసమయి వ్యాఖ్యలు చేశారు. అయితే గద్దర్ వ్యవహారంలో కాంగ్రెస్‌కు ఉన్న పాజిటీవ్‌ను బీఆర్ఎస్ తమవైపు తిప్పుకునే ప్రయత్నాలకు బీఆర్ఎస్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.