- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్‌కు ఆసలు ఆ ఆలోచనే లేదు: మాజీ మంత్రి కేటీఆర్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ 64 స్థానాలతో ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. కాగా గతకొద్ది రోజులగా రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని.. ప్రభుత్వంలోని మంత్రులే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని.. విమర్శలు చేస్తున్నారు.
తాజాగా మాజీ సీఎం కేసీఆర్ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూలిపోయే వాతావరణం కనిపిస్తుందని వ్యాఖ్యనించారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు చేస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ రూమర్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. తమకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచనే లేదని.. ఆ ప్రచారంలో నిజం లేదని.. స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్, బీజేపీ పార్టీలో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారని ఎద్దేవ చేశారు. ఇందులో భాగంగానే పలు పార్లమెంట్ స్థానంలో బీజేపీ గెలిచే విధంగా డమ్మీ అభ్యర్థులను నిలబెట్టారని విమర్శలు చేశారు.
Read More..
Kishan Reddy : సీఎం రేవంత్ మొనగాడు కాదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్