రేపు BRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. చర్చించే అంశాలివే..!

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-25 07:13:30.0  )
రేపు BRS పార్లమెంటరీ పార్టీ మీటింగ్.. చర్చించే అంశాలివే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నారు. ఎర్రవెల్లి లోని ఫామ్ హౌస్‌లో పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన సమావేశం జరగనుంది. మధ్యాహ్నం నిర్వహించే సమావేశానికి రాజ్యసభ, లోక్ సభ సభ్యులు హాజరు కావాలని సమాచారమిచ్చారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సైతం హాజరు కానున్నారు. ఈనెల 31వ తేదీ నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ పార్లమెంట్లో అనుసరించాల్సిన విధానాలను కేసీఆర్ ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అదేవిధంగా పలువురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్‌పై అధినేత క్లారిటీ ఇవ్వలేదు. కేవలం బోయినపల్లి వినోద్ కుమార్, రంజిత్ రెడ్డి, నామా నాగేశ్వరరావు మాత్రమే ఎంపీ టికెట్‌పై హామీ ఇచ్చారు. మిగతా సిట్టింగ్లకు పార్లమెంటరీ సన్నాక సమావేశాల్లో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ సమావేశంలో క్లారిటీ ఇస్తారని కొంతమంది ఆశిస్తున్నట్లు తెలిసింది.

తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం రాజకీయాల్లో, ఇటు పార్టీలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేలు క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా కొంత చర్చ జరుగుతూనే ఉంది. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ అధిష్టానం నేతలకు ఏం భరోసా కల్పించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. పార్లమెంటరీ సన్నాహక సమావేశాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా ఎంపీలకు ఏమైనా మార్గ నిర్దేశం చేసే అవకాశం ఉందని సమాచారం. నిత్యం ప్రజల్లో ఉన్నవారికి పెద్దపీట వేస్తామని పార్టీలో గుర్తింపు ఇస్తామని కూడా చెప్పే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Next Story

Most Viewed