BRS: సభలో బూతులు మాట్లాడే వారికే అవకాశం.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి

by Ramesh Goud |
BRS: సభలో బూతులు మాట్లాడే వారికే అవకాశం.. మాజీమంత్రి జగదీష్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: స్పీకర్(Speaker) సభలో బూతులు మాట్లాడే వారికి అవకాశం ఇస్తున్నారని, ఆయన ప్రభుత్వంలో భాగస్వామ్యం కాకుడదు అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత గుంతకండ్ల జగదీష్ రెడ్డి(BRS Leader Jagadeesh Reddy) అన్నారు. అసెంబ్లీ సమావేశం(Telangana Assembly Sessions) అనంతరం మీడియా పాయింట్ లో మాట్లాడిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్(BRS party) తరుపు నుంచి సీనియర్ సభ్యులు మాట్లాడేందుకు సమయం ఇవ్వమని అడిగితే మీ పేరు లేదని చెప్పి, అధికార పక్షం వాళ్లకి పేరు లేకున్నా బూతులు మాట్లాడే వారికి స్పీకర్ సమయం ఇస్తున్నారని మండిపడ్డారు.

అంతేగాక మా ప్రశ్నలు వచ్చే సమయానికి సభను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. స్పీకర్ ప్రభుత్వంలో భాగం కాకుడదని హితవు పలికారు. ఏది ఏమైనా.. లగచర్ల(Lagacharla), దిలావర్ పూర్(DilavarPur), రామన్నపేట(Ramannapeta) ఘటనలతో పాటు రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేస్తున్న హింసాత్మక సంఘటనలపై మా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలను హింస పెడుతున్న అన్ని అంశాలలో పూర్తి స్థాయిలో ప్రజల వెంట ఉంటామని, ప్రజలను పెడుతున్న హింసను అడ్డుకుంటామని, మేము హింస పడటానికైనా సిద్దంగా ఉన్నాం కానీ ప్రజలను ఇబ్బందులు పడనీయమని చెప్పారు. ఇవాళ ఒక్కరోజు తప్పించుకున్నా.. ప్రభుత్వం మెడలు వంచేందుకు మా పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అన్నారు.

Advertisement

Next Story