BRS: మరోసారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం.. హరీష్ రావు ఫైర్

by Ramesh Goud |   ( Updated:2024-10-19 13:36:57.0  )
BRS: మరోసారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం.. హరీష్ రావు ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీజేపీల చీకటి ఒప్పందం మరోసారి బయటపడిందని, బీఆర్ఎస్‌కు ఒక న్యాయం.. బీజేపీకి మరో న్యాయమా అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. గ్రూప్-1 అభ్యర్థులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్ పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన నిరసనలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా.. గ్రూప్స్ అభ్యర్థులు చేస్తున్న నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ముఠా గోపాల్, దాసోజు శ్రవణ్ సహా ఇతర నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.

అలాగే ఈ అరెస్ట్ లతో కాంగ్రెస్ - బీజేపీకి మధ్య ఉన్న చీకటి ఒప్పందం మరోసారి బట్టబయలైందని ఆరోపించారు. ఈ సందర్భంగా బీజేపీకి ఒక న్యాయం..?, బీఆర్ఎస్ కు ఒక న్యాయమా..? అని ప్రశ్నించారు. గంటల పాటు కేంద్ర మంత్రి బండి సంజయ్ వచ్చి నిరసన తెలియజేస్తుంటే అడ్డుకోని కాంగ్రెస్ ప్రభుత్వం.. బీఆర్ఎస్ నాయకులను మాత్రం అరెస్టు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. అంతేగాక వారి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఇక రాజకీయాలు పక్కనబెట్టి ముందు విద్యార్థుల సమస్య పరిష్కరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆపాలని హరీష్ రావు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed