- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BRS MLC: ఫోర్త్ సిటీ పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం
దిశ, వెబ్‌డెస్క్: ఫోర్త్ సిటీ(Fourth City) పేరుతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్మీ తక్కెళ్లిపల్లి రవీందర్ రావు(Takkallapalli Ravinder Rao) ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ధర్నాతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని అన్నారు. గతంలో మేము కూడా మెడికల్ కాలేజీ కోసం భూములు తీసుకున్నాం.. న్యాయంగా గిరిజన బిడ్డలకు నష్టపరిహారం ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కోసం కంపెనీల పేరిట భూములు లాక్కుంటున్నాడని ఆరోపించారు.
గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మా కంపెనీల కోసం భూమి సేకరించారని గుర్తుచేశారు. పర్యావరణ సమస్య రాకుండా ఉండేందుకు ఫార్మాకు కేటాయించిన భూములతో ఫోర్త్ సిటీ పేరిట సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టుకున్నా.. బీఆర్ఎస్ నాయుకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ కట్టించిన భవన్‌లను వదిలేసి తన ఇంటి కూడా ఇనుపకంచెలు వేసుకొని భయం భయంగా ఉన్నారని విమర్శించారు. అక్రమ అరెస్ట్‌లకు భయపడబోం అని అన్నారు.