- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను తాగుతున్నది భగీరథ నీళ్ళే: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధు
దిశ, తెలంగాణ బ్యూరో: తాను తాగుతున్నది భగీరథ నీళ్ళేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీ కౌన్సిల్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా భగీరథ నీళ్లు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. ఈ పథకం వలన ఎన్నో రోగాలకు చెక్ పడిందన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మిషన్ భగీరథపై తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. కౌన్సిల్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మిషన్ భగీరథ స్కీమ్ ఫెయిలైందని, నిరూపయోగంగా మారిందని, ప్రజలకు నీళ్లు అందడం లేదని పేర్కొనగా, దీనికి తాతా మధు కౌంటర్ ఇచ్చారు.
ఎమ్మెల్సీగా ఉన్న తానే స్వయంగా భగీరథ నీళ్లు తాగుతున్నానని చెప్పడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతానికి పైగా ప్రజలకు ఇంటింటికీ నల్లా ద్వారా భగీరథ నీళ్లను అందిస్తున్నామన్నారు. తాగు నీటి అంశంపై ఈ ఇరువురి నేతల మధ్య కౌన్సిల్‌లో స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. చివరికి కౌన్సిల్ చైర్మన్ జోక్యం చేసుకొగా, తాతా మధు కూల్ అయ్యారు. జీవన్ రెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రశ్నిస్తూనే, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ చేయబోతే కార్యక్రమాలను వివరించే ప్రయత్నం చేశారు.