- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సింగరేణిని కాపాడుకున్న వ్యక్తి సీఎం కేసీఆర్.. ఎమ్మెల్సీ కవిత
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సింగరేణి కార్మికులకు ఇంక్రిమెంట్లతో పాటు, చిరకాల వాంఛ అయిన డిపెండెంట్ ఉద్యోగాలను సైతం సాధించుకున్నామని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ ఉద్యోగాలు రాకుండా వ్యక్తులు, శక్తులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సీఎం కేసీఆర్ కార్మికుల పక్షాన నిలిచి కారుణ్య నియామ ప్రక్రియ ద్వారా ప్రతినెలా ఉద్యోగులను తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు దాదాపు 15 వేల వారసత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సింగరేణి సంబరాలు జరుపుకుంటున్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు సోమవారం శుభాకాంక్షలు తెలిపారు.
వారసత్వ ఉద్యోగాలు కేవలం పురుషులకే కాకుండా, కూతుర్లు, కోడళ్లకు సైతం అవకాశం ఇవ్వడం ద్వారా మహిళల పట్ల కేసీఆర్ కు ఉన్న గొప్ప మనసును తెలియజేస్తోందన్నారు. కారుణ్య ఉద్యోగం వద్దనుకున్న వారికి గతంలో ఇస్తున్న రూ.10 లక్షలను , తెలంగాణ రాష్ట్రం వచ్చాక రూ.25 లక్షలకు పెంచామని గుర్తుచేశారు. ఉద్యోగ విరమణ వయస్సును కూడా 61ఏళ్లకు పెంచుకోవడం సంతోషకరమన్నారు.
కార్మికులకు సౌకర్యవంతంగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో సింగరేణి క్వార్టర్స్ కు ఉచిత విద్యుత్ తో పాటు, ఏసీ ఏర్పాటు చేసుకునే సౌకర్యాలు కల్పించడం, ఇంటికి పది లక్షల రూపాయల వరకు వడ్డీలేని రుణాలు, మహిళా కార్మికులకు రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్, దివ్యాంగులకు ఉద్యోగాలు, సింగరేణి ఏరియా ఆస్పత్రులలో తల్లిదండ్రులకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పించడం, ఉద్యోగ విరమణ తర్వాత కూడా వైద్య సదుపాయాలు అందించడం, సింగరేణి కార్మికుల పిల్లల ఐఐటీ, ఐఐఎం లాంటి చదువులకు ఫీ రీయింబర్స్ మెంట్ ఇవ్వడం, సింగరేణి కార్మికుల కోసం మెడికల్ కాలేజీ లాంటి అనేక గొప్ప కార్యక్రమాలు తెలంగాణ వచ్చాక సాధించుకున్నామని తెలిపారు.
బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజుతో పాటు, మరో రోజున వేతనంతో కూడిన అధికారిక సెలవుగా ప్రకటించి సీఎం అంబేద్కర్ పట్ల ఉన్న గొప్ప ప్రేమను మరోసారి చాటుకున్నారని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను కాపాడి, విస్తరించి, ఇతర రాష్ట్రాలకు సైతం సోలార్, థర్మల్ పవర్ ప్లాంట్ లను అధనంగా పెట్టి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వడం, సంస్థను లాభాల బాట పట్టించడం తెలంగాణ రాష్ట్రం రావడం వల్లనే, తెలంగాణ బిడ్డ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండటం వల్లనే సాధ్యమయ్యాయని గర్వంగా చెబుతున్నానన్నారు.