విపక్ష పార్టీ నుంచి ఆఫర్.. త్వరలో బీఆర్ఎస్‌కు ఆ ఎమ్మెల్సీ ఝలక్!

by GSrikanth |
విపక్ష పార్టీ నుంచి ఆఫర్.. త్వరలో బీఆర్ఎస్‌కు ఆ ఎమ్మెల్సీ ఝలక్!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొన్ని రోజులుగా సౌత్ తెలంగాణకు చెందిన ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ప్రభుత్వ, పార్టీ పొగ్రామ్స్‌కు దూరంగా ఉంటున్నారు. అన్ని కార్యక్రమాలకు ఆహ్వానాలు పంపినా అటువైపునకు వెళ్లడం లేదు. ఇటీవల జరిగిన సెక్రటేరియట్ ప్రారంభోత్సవం, పాలమూరు ప్రాజెక్టు రివ్యూకు డుమ్మా కొట్టారు. దీంతో సదరు ఎమ్మెల్సీ త్వరలో పార్టీ మారేందుకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. దీంతో పార్టీ మారొద్దని పెద్దలు తీవ్ర ప్రయత్నాలు చేస్తోన్నా ఆ ఎమ్మెల్సీ మాత్రం కారు దిగేందుకే మొగ్గు చూపుతున్నట్టు టాక్.

విపక్ష పార్టీ నుంచి ఆఫర్

సెక్రటేరియట్ ప్రారంభోత్సవానికి ఆ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లీడర్లు అందరూ వచ్చినా సదరు ఎమ్మెల్సీ మాత్రం కనిపించలేదు. అలాగే సోమవారం సెక్రటేరియట్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు రివ్యూకి సైతం దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండగా ఎమ్మెల్యే కావాలని ఆ ఎమ్మెల్సీ తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ జిల్లా పార్టీలోని రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆ చాన్స్ దక్కలేదు.

బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాతనైనా ఎమ్మెల్యే అవుతానని ఆశ పడ్డారు. కానీ అదే సమీకరణ అడ్డురావడంతో ఎమ్మెల్సీ పదవికి పరిమితం అయ్యారు. కానీ వయోభారంతో త్వరలో రాజకీయాలకు గుడ్ చెప్పాలనే యోచనలో ఉన్న సదరు ఎమ్మెల్సీ తన కొడుకును ఎమ్మెల్యేగా చేయాలని ఆశపడ్డారు. అందులో భాగంగా ఈ మధ్య విపక్ష పార్టీతో సంప్రదింపులు జరిపితే, తమ పార్టీలోకి వస్తే కొడుకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ లభించినట్లు తెలుస్తున్నది. ఒకవేళ కొడుకు రాజకీయ భవిష్యత్‌కు తన ఎమ్మెల్సీ పదవి అడ్డుగా ఉంటే ఆ పదవికి రాజీనామా చేసి, కొడుకుతోపాటు పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story