Koushik Reddy: ఇన్‌స్పెక్టర్ వెంటబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-04 10:40:36.0  )
Koushik Reddy: ఇన్‌స్పెక్టర్ వెంటబడ్డ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌(Banjara Hills)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone tapping case)లో ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్(BRS) నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Padi Kaushik Reddy) బుధవారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అదే సమయంలో తనకు వేరే పని ఉందంటూ ఇన్స్‌పెక్టర్ స్టేషన్ నుంచి బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తన కంప్లైంట్ తీసుకోవాలని కౌశిక్ రెడ్డి ఇన్‌స్పెక్టర్ వెంటబడ్డారు. ఇన్‌స్పెక్టర్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఇరువురి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగించారు.

Advertisement

Next Story