కాంగ్రెస్‌లో చేరడంపై క్లారిటీ ఇచ్చిన BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

by Satheesh |
కాంగ్రెస్‌లో చేరడంపై క్లారిటీ ఇచ్చిన BRS ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు వస్తోన్న వార్తలపై భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆ వార్తలను ఖండించారు. కేసీఆర్ తనపై నమ్మకంతో టికెట్ ఇచ్చారని.. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తానని తేల్చిచెప్పారు. కాగా, బీఆర్ఎస్ నుండి ఖమ్మంలో జిల్లాలోని భద్రాచలం నుండి తెల్లం వెంకట్రావు గెలుపొందారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 స్థానాల్లో 9 కాంగ్రెస్ గెలవగా.. ఒక్క భద్రాచలం నుండే బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు విజయం సాధించారు. అయితే, కాంగ్రెస్ కీలక నేత అయిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అనుచరుడిగా తెల్లం వెంకట్రావుకు పేరు ఉంది. ఈ నేపథ్యంలో తెల్లం వెంకట్రావు కూడా కారు దిగి హస్తం గూటికి చేరుతారని జోరుగా వార్తలు వినిపించాయి. దీంతో పార్టీ మార్పు వార్తలపై తెల్లం వెంకట్రావు పై విధంగా క్లారిటీ ఇచ్చారు.

Advertisement

Next Story