రంజాన్ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం.. BRS MLA సంచలన వ్యాఖ్యలు

by GSrikanth |
రంజాన్ వేడుకల్లో ఆసక్తికర సన్నివేశం.. BRS MLA సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన రంజాన్ వేడుకల్లో ఆకస్తికర సన్నివేశం చోటుచేసుకుంది. టికెట్ రేసులో ఉన్నానని ప్రచారం చేసుకుంటున్న జాన్సన్ నాయక్‌ను ఎమ్మెల్యే రేఖా నాయక్ పలకరించారు. ఈ సందర్భంగా రేఖా నాయక్ మాట్లాడుతూ.. జాన్సన్ నా గెలుపుకోసం పనిచేస్తారని వ్యాఖ్యానించారు. అంతేగాక, జాన్సన్‌ నాయక్‌కు వేరే చోట టికెట్ ఇస్తారని క్లారిటీ ఇచ్చారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారంతా నా గెలుపు కోసం పనిచేస్తారని, వాళ్లంతా నా మిత్రులే అని రేఖా నాయక్ ధీమా వ్యక్తం చేశారు. ఖానాపూర్ అభ్యర్థిగా తనను అధిష్టానం ఇప్పటికే డిసైడ్ చేసిందని, మళ్లీ తానే ఎమ్మెల్యే కాబోతున్నారని అనూహ్య వ్యాఖ్యలు చేశారు. అనవసరంగా వాట్సాప్ గ్రూపుల్లో చేసే అసత్య ప్రచారాలు నమ్మొద్దని అభిమానులకు, పార్టీ శ్రేణులకు సూచించారు.

Advertisement

Next Story