ఢిల్లీ లిక్కర్ కేసులో బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి తీరు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
ఢిల్లీ లిక్కర్ కేసులో బీజేపీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి తీరు.. హరీష్ రావు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎ రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కాంగ్రెస్‌ నేతలు తలో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈ కేసులో కాంగ్రెస్ హైకమాండ్‌ది ఒకదారి.. సీఎం రేవంత్ రెడ్డిది మరోదారి అని ఎద్దేవా చేశారు. బీజేపీకి బీటీమ్ లీడర్‌గా రేవంత్ రెడ్డి తీరు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ఏకీభవించడం లేదని.. ఇందులో రేవంత్ రెడ్డి బీజేపీ అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇదంతా చూస్తుంటే రేవంత్ రెడ్డి.. ఖర్గే, రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు లేదు.. మోడీ నాయకత్వంలో పనిచేస్తున్నట్లు ఉందని అన్నారు. అగ్రనాయకులే కాదు.. ఏకంగా కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. కాగా, ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరు పర్చగా.. వారంరోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.

Advertisement

Next Story