BRS: రుణమాఫీ అయ్యే వరకు సీఎం రేవంత్‌ను నిద్రపోనివ్వం: ఎమ్మెల్యే వివేకానంద

by Shiva |   ( Updated:2024-08-05 09:21:07.0  )
BRS: రుణమాఫీ అయ్యే వరకు సీఎం రేవంత్‌ను నిద్రపోనివ్వం: ఎమ్మెల్యే వివేకానంద
X

దిశ, వెబ్‌డెస్క్: రైతు రుణమాఫీ పూర్తయ్యేంత వరకు సీఎం రేవంత్‌రెడ్డిని నిద్రపోనివ్వబోమని కత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశంలో తమ మహిళా సభ్యులను అవమానించి సభలో మాట్లాడకుండా చేశారని ఆరోపించారు. రుణమాఫీపై చర్చిస్తామంటే కాంగ్రెస్ భయపడి పారిపోయిందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా రైతు భరోసాపై నిలదీస్తే.. అధికార పక్షం నుంచి సీఎం, డిప్యూటీ సీఎం ఎలాంటి సమాధానం ఇవ్వలేదని అన్నారు. దేవుళ్లపై ముఖ్యమంత్రి ఒట్టు పెట్టి రైతులను నిలువునా మోసం చేశారని ఆరోపించారు. అదేవిధంగా నిండు సభలో తమపై విషం చిమ్మారంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలపై మాత్రం మాట్లాడలేదని.. రుణమాఫీ అయ్యేంత వరకు రేవంత్ రెడ్డిని నిద్రపోనివ్వబోమని వివేకానంద అన్నారు.

Advertisement

Next Story