- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బీఆర్ఎస్ నేతలు కంటి వెలుగు పరీక్షలు చేసుకోండి'
X
దిశ, డైనమిక్ బ్యూరో: కరెంట్ కోతలపై అసెంబ్లీలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. కనీసం 8, 9 గంటల పాటైనా విద్యుత్ సరఫరా చేయని ప్రభుత్వం అసెంబ్లీలో మాత్రం 24 గంటల పాటు ఇస్తున్నట్లు పచ్చి అబద్దాలు చెబుతోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ సభ్యులు కంటి వెలుగు పరీక్షలు చేసుకోవాలని అప్పుడైనా విద్యుత్ కోసం రైతులు చేస్తున్న ధర్నాలు కనిపిస్తాయని అన్నారు.
గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జీవన్ రెడ్డి సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ఫైర్ అయ్యారు. కరెంట్ కోతలపై నిజానిజాలు తెలుసుకునేందుకు అఖిలపక్షాన్ని గ్రామాల్లోకి తీసుకువెళ్లాలన్నారు. ఇకనైనా రైతులను ఆదుకుని కనీసం రోజుకు 13 గంటల విద్యుత్ ఇవ్వాలన్నారు.
Advertisement
Next Story