- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రులకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్న పోలీసులు
by GSrikanth |
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పోలీసులు మంత్రులకు ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తున్నారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు. యాదాద్రి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై దౌర్జన్యానికి పాల్పడిన పోలీసులపై డీజీపీ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సందీప్ రెడ్డిపై దౌర్జన్యం కాంగ్రెస్ పార్టీ అహంకారానికి నిదర్శనం అన్నారు.
మంత్రులు ప్రవర్తిస్తున్న తీరు సిగ్గు చేటన్నారు. ఓడిపోయిన నేతలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల్ని ప్రశ్నిస్తే పోలీసుల్ని రెచ్చగొట్టి నెట్టివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
Advertisement
Next Story