- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘తెలంగాణలోని ప్రతి ఇంచు మీద కేసీఆర్‌కు అవగాహణ ఉంది’
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన బహిరంగ సభలో నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలోని ప్రతి ఇంచు మీదా కేసీఆర్‌కు అవగాహన ఉందని అన్నారు. ఏ జిల్లాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి.. ఏ ప్రాజెక్టు ఎక్కడ కట్టాలో కేసీఆర్‌కు బాగా తెలుసని తెలిపారు. నీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి మళ్లించాలో ఆయనకంటే ఎక్కువ తెలిసినోడు రాష్ట్రంలో ఎవడూ లేదని సీరియస్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు నీళ్లిచ్చి.. రైతును రాజు చేసింది కేసీఆర్ అని అన్నారు. మిషన్ కాకతీయ కింద 46 వేల చెరువులు బాగు చేశామని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ ఇంటికి తారునీరు అందించినట్లు వెల్లడించారు.
కొత్త ప్రాజెక్టులు చేపట్టి ఆయకట్టుకు నీరు అందించారని గుర్తుచేశారు. కాళేశ్వరంలో చిన్న తప్పును పట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తోందని మండిపడ్డారు. ఎవరెన్ని డ్రామాలు ఆడిగా కేసీఆర్ ఎంటో రాష్ట్ర ప్రజలకు తెలుసని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోయిందని అన్నారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామన్న భావన ప్రజల్లో వస్తోందని తెలిపారు. పాలన చేతకాక కాంగ్రెస్ నేతలు చేతులెత్తేశారని ఎద్దేవా చేశారు. అమలుకు సాధ్యం కానీ హామీలు గుప్పించి ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాళేశ్వరం వద్ద డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.