CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను దిల్‌రాజు సమర్థిస్తున్నారా?

by Gantepaka Srikanth |
CM రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను దిల్‌రాజు సమర్థిస్తున్నారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను దిల్‌రాజు సమర్థిస్తున్నారా? అని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ప్రశ్నించారు. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. సినీ పరిశ్రమను ఆంధ్రాకు తరలించే టాస్క్‌లో మీరు చాలా బాగా కృషి చేస్తున్నారని, అందుకే అసలు విజయవాడకు సినిమా రంగానికి సంబంధం లేకున్నా సరే.. సినిమాలకు విజయవాడ కేరాఫ్ అడ్రస్ అని తెగ పొగుడుతున్నారన్నారు. తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆంధ్రాలో సినిమా అభివృద్ధికి మీరు ప్రయత్నించడం సిగ్గుచేటు అన్నారు. దిల్ రాజు.. కేటీఆర్‌ని విమర్శించే ముందు మేము అడిగే ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని అన్నారు. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమలు లాగి లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దు అని చెప్పిన దిల్ రాజు.. ముందుగా మీరు లెటర్ రాసింది ఎఫ్డీసీ చైర్మన్ హోదాలో అది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పదవి అది గుర్తుపెట్టుకోవాలని సూచించారు.

అదే మీరు ఒక ప్రొడ్యూసర్ హోదాలో ఈ లెటర్ రాసి ఉంటే మీరు చెప్పినట్టు చిత్ర పరిశ్రమను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో రాసినట్టు అర్థం చేసుకునే వాళ్ళం అన్నారు. సినీ పరిశ్రమపై రేవంత్ సర్కారు చేస్తున్నటువంటి తీరుని జాతీయ మీడియా ఎండగట్టిన తీరు మీరు ఏ విధంగా చూస్తారు.. మీరు చిత్ర పరిశ్రమను కాపాడాలనుకుంటే దానిమీద మీరు ఎందుకు మాట్లాడటం లేదన్నారు. నటి సమంతపై మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా..? ఈ విషయంలో చిత్ర పరిశ్రమ తరపున మీ వైఖరి ఏమిటి? మొట్టమొదట సంధ్య థియేటర్‌లో జరిగినటువంటి వ్యవహారంలో తప్పు అల్లు అర్జున్‌దా? ప్రభుత్వాన్నిదా దీనిమీద ముందు మీరు స్పష్టత ఇవ్వండి..? కమాండ్ కంట్రోల్ రూమ్‌లో మీటింగ్ అయిన తర్వాత అల్లు అర్జున్ కేసు ఎందుకు అటకెక్కింది.. మీ మధ్యలో జరిగిన ఒప్పందం ఏమిటి...? అని నిలదీశారు.

Advertisement

Next Story

Most Viewed