- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థుల ప్రతిభ
దిశ, వైరా : కరీంనగర్ లో గంగోత్రి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీల్లో వైరాకు చెందిన న్యూ లిటిల్ ఫ్లవర్ విద్యార్థులు బంగారు, వెండి పతకాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. ఈ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు బి.మహేశ్వరి, ఎం.మీనాక్షి బంగారు పతకాలు సాధించారు. అదే విధంగా సీహెచ్. కౌశిక్, కె. జశ్వంత్, ఎం. ఆరాధ్య, కె. జేసుసలైశ వెండి పతకాలను సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ డాక్టర్ పోతినేని భూమేశ్వరరావు, డైరెక్టర్ సుమన్ మాట్లాడుతూ భారత దేశంలో 5000 సంవత్సరాల క్రితం యోగా ఉద్భవించిందని చెప్పారు.
యోగా శారీరక భంగిమలు, శ్వాస వ్యాయామాలు, ధ్యానాన్ని మిళితం చేస్తుందని వివరించారు. పార్కులు, కమ్యూనిటీ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో ప్రజలందరూ కలిసి యోగా సాధన చేస్తున్నారని పేర్కొన్నారు. దైనందిన జీవితంలో మనిషి మానసిక ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా సాధన ఒక్కటే మార్గమని సూచించారు. ప్రతిరోజూ యోగా చేయడం వలన మానసిక శారీరక రుగ్మతలను దూరం చేసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. తమ పాఠశాల విద్యార్థులు యోగా పోటీలో రాష్ట్రస్థాయి పతకాలు సాధించటం వైరాకే గర్వకారణం అన్నారు. భవిష్యత్లో తమ విద్యార్థులు మరిన్ని బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పతకాలు సాధించిన విద్యార్థులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ షాజీ మాథ్యూ, ఏఓ సామినేని నరసింహారావు, యోగా గురువు రజిని విద్యార్థులు పాల్గొన్నారు.