ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తాం అంటున్నారు.. నా అంగం గట్టిపడట్లేదు.. నేనేం చేయాలి

by Bhoopathi Nagaiah |
ఇంట్లో వాళ్లు పెళ్లి చేస్తాం అంటున్నారు.. నా అంగం గట్టిపడట్లేదు.. నేనేం చేయాలి
X

మేడమ్ నాకు 29 ఏళ్ళు. హస్తప్రయోగం అలవాటుంది. ఇప్పటిదాకా ఏ స్త్రీతో లైంగికంగా కలవలేదు. ఈ మధ్య నాకు ఎంత ప్రయత్నించినా అంగం గట్టి పడట్లేదు. వీర్యం వస్తుంది. నాకింకా పెళ్లి కాలేదు. ఒకప్పుడు ఆల్కహాల్ తీసుకునే వాణ్ణి. ఇప్పుడు మానేశాను. నాకిప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. భయంగా ఉంది. నేనేం చేయాలి. -కుమార్, ఆసిఫాబాద్

స్త ప్రయోగానికి అంగం గట్టిపడక పోవడానికి సంబంధం లేదు. దానికి వేరే కారణాలున్నాయి. బీపీ, షుగరు, గుండె జబ్బులు, థైరాయిడ్, కోలేష్ట్రాల్, వరిబీజం, లివర్, కిడ్నీ సమస్య, రక్తనాళాల్లో సమస్యలు, సెక్స్ హార్మోన్స్ లోపం, సిగరెట్స్, ఆల్కహాల్, గుట్కా లాంటి అలవాట్లు ఇవన్నీ అంగస్తంభన లోపాలను కలిగించే శారీరిక కారణాలు. ఈ రోగాలను తగ్గించడానికి దీర్ఘకాలంగా వాడే మందులు కూడా అంగస్తంభన సమస్యను కలిగిస్తాయి. అలాగే విపరీతమైన మానసిక వత్తిడి, మానసిక రోగాలు. ఈ రోగాలు తగ్గించే ఏంటీ సైకోటిక్ , ఏంటీ డిప్రెసెంట్ మందులు కూడా అంగస్తంభన లోపాన్ని కలిగిస్తాయి. అయితే 29ఏళ్ల వయసులో ఈ క్రానిక్ జబ్బులు నీకుండే అవకాశం లేకపోయినా కానీ నీవు ఒకసారి ఈడీ ప్రొఫైల్ చేయించుకోవాలి. దీనిలో పై జబ్బులు అన్నింటికీ చెందిన పరీక్షలు ఉంటాయి. అవసరమైతే అంగంలోకి రక్త సరఫరా అవుతుందా లేదా లేక వీనస్ ఇన్ సపీసీఎన్సీ వలన రక్తం వెనక్కి వెళ్లిపోతుందా, అలాగే బీర్జాలలో వేరికోస్ వెయిన్స్, ఇతర బీర్జా సమస్యలున్నాయా తెలుసుకోవడానికి penile & scrotal colour dopler టెస్ట్ చేయుంచుకోవాలి. ఒకసారి sexologist ని కలువు. ఆందోళన వద్దు.

- డాక్టర్ భారతి, MS

మేరిటల్ కౌన్సెలర్

సైకోథెరపిస్ట్ & సెక్సాలజిస్ట్

Advertisement

Next Story