- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కడియం వల్లే ఆ ముగ్గురు పార్టీకి దూరమయ్యారు.. BRS నేత ఆరోపణ
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమైన ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదవులు అనుభవించి, అవకాశాలు పొంది కొందరు పార్టీ మారుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్, తెలుగుదేశంలో వెంటిలేటర్ మీద ఉన్న వాళ్లకు సంజీవని ఇచ్చి కేసీఆర్ బతికించారని గుర్తుచేశారు. రాజయ్య చేతిలో ఓటమి పాలై మూలకు ఉన్న కడియం శ్రీహరికి కేసీఆర్ అన్ని రకాలుగా అవకాశాలు కల్పించారని అన్నారు. ఒక పదవిలో ఉండగానే సిట్టింగులను కాదని శ్రీహరికి అవకాశాలు ఇచ్చారని తెలిపారు. కేసీఆర్‌ను తప్పు పట్టే అర్హత కడియం కావ్యకు ఎక్కడిది? అని మండిపడ్డారు. కడియం కారణంగానే రాజయ్య, అరూరి రమేష్, పసునూరి దయాకర్ పార్టీకి దూరమయ్యారని ఆరోపించారు.
రాజకీయ విలువలు లేని పవర్ బ్రోకర్లలా వ్యవహరిస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీలు మారే ఇలాంటి లీడర్ల కంటే ఊసరవెల్లి బెటర్ అని అన్నారు. ముందు పదవులకు రాజీనామా చేసి పోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు దర్శకత్వంలో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు.. కానీ, అది ఎప్పటికీ జరుగదు అని అన్నారు. వయసు పెరిగిన ప్రతి వారు మేధావి అనుకుంటే సరిపోదని ఎద్దేవా చేశారు. కడియం లాంటి వారి వల్ల జాతికి ఎలాంటి లాభం లేదన్న మందకృష్ణ వ్యాఖ్యలు నిజమని నిరూపించారని గుర్తుచేశారు. అలా ఇలా కాదు.. ఏకంగా ఇలాంటి వాళ్లను రాళ్లతో కొట్టి చంపాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.