‘బీజేపీకి వచ్చే సీట్లు 220.. ఇంతకుమించి ఒక్కటి కూడా పెరగదు’

by GSrikanth |
‘బీజేపీకి వచ్చే సీట్లు 220.. ఇంతకుమించి ఒక్కటి కూడా పెరగదు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్టై తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్యే కవితను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌తో కలిసి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కలిశారు. ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ ఒక్కరికి కూడా నష్టం జరుగలేదు. ఇది పూర్తిగా బీజేపీ రచించిన బూటకపు కేసు. ఇలాంటి కేసులకు అదిరేది లేదు. బెదిరేది లేదు. చేయని తప్పుకు కవిత జైలు జీవితం గడుపుతున్నారు. అయినా కవిత జైల్లో ధైర్యంగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి 220 సీట్లకు మించి రావు. చాలా చోట్ల బీజేపీపై వ్యతిరేకత కనిపిస్తోంది. తెలంగాణలోనూ బీజేపీ అనేక చోట్ల మూడో స్థానానికే పరిమితం కానుంది. రాజకీయ దురుద్దేశంతోనే కవితపై కేసు పెట్టారు. బీజేపీ రాచరిక పోకడలను దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు. ఇలాంటి పార్టీ మరోసారి దేశంలో అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో అందరూ ఆలోచించాలని కోరారు. కాంగ్రెస్ సైతం పరోక్షంగా బీజేపీకే మద్దతునిస్తోందని విమర్శించారు. తెలంగాణలో అనేక చోట్ల డమ్మీ అభ్యర్థులను పోటీలో పెట్టి బీజేపీ అభ్యర్థుల గెలుపును సునాయాసం చేసే ప్రయత్నం చేసిందని అన్నారు.


Advertisement

Next Story