BRS: కేసీఆర్ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్లాన్ ఇదేనా?.. మాజీ మంత్రి హరీష్ రావు

by Ramesh Goud |   ( Updated:2024-10-15 05:42:19.0  )
BRS: కేసీఆర్ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్లాన్ ఇదేనా?.. మాజీ మంత్రి హరీష్ రావు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ.. ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వరుస ట్వీట్ లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకుందని ఆరోపించారు. ప్రభుత్వం 10 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో యజమాని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ కు తాళం వేసిన దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో గురుకులాల నిర్వహణ అద్వాన్న స్థితికి చేరుకున్నదనడానికి ఇది మరొక నిదర్శనమని ద్వజమెత్తారు. ముఖ్యమంత్రి గురుకులాలకు అద్దెలు ఇంకెప్పుడు చెల్లిస్తారని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రోజురోజుకి దిగజారి పోతున్న విద్యావ్యవస్థ గురించి విద్యా శాఖ మంత్రిగా కూడా ఉన్న మీరు.. ఇంకెప్పుడు పట్టించుకుంటారని నిలదీశారు.

అలాగే బీసీ ఓవర్సీస్ పథకం నిధుల విడుదలపై స్పందిస్తూ.. ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. గతంలో మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్థిక సహాయం మంజూరైన 65 మంది బీసీ విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు నిధులు విడుదల చేయలేదన్నారు. కేసీఆర్ అనుకున్న ఓవర్సీస్ ఫెలోషిప్ పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ యోచిస్తోందా అని, తెలంగాణలో కేసీఆర్ వారసత్వాన్ని తుడిచిపెట్టే ప్లాన్ ఇదేనా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్లు, విగ్రహాలను మార్చడం చాలా సులభం, కానీ వాగ్దానాలను నిలబెట్టుకోవడం చాలా కష్టమని తెలిపారు. కాంగ్రెస్‌కు కామారెడ్డి వద్ద చేసిన బీసీ డిక్లరేషన్ గుర్తుందా అని, తమ తొలి అసెంబ్లీ సెషన్‌లో బీసీ సబ్‌ప్లాన్‌పై వారి గొప్ప వాగ్దానం ఏమైందని ప్రశ్నించారు, సీఎం ఇది చేస్తారా? అని హరీష్ రావు రాసుకొచ్చారు.

Advertisement

Next Story