- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్: హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగియనున్న వేళ మాజీ మంత్రి హరీశ్ రావు ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు. ‘మీ కష్టాలతో కలబడాలంటే.. మీ కోసమే తలపడాలంటే.. బీఆర్ఎస్ గెలిచి నిలబడాలి, పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేద్దాం.. ప్రశ్నించే గొంతులను పార్లమెంట్‌కు పంపిద్దాం’ అని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. మరోవైపు ఇవాళ గజ్వేల్ రోడ్డు షోలో హరీశ్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేసిన మంచి పనులను అన్ని రద్దు చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
నోటి కాడి బుక్కను గుంజుకున్నారని, గజ్వేల్‌లో 150 కోట్ల పనులను కాంగ్రెస్ పాలన వచ్చాక ఆపేశారని ఆరోపించారు. ఇది మోసాల కాంగ్రెస్ అని మండిపడ్డారు. కేసీఆర్ సెక్యూలర్ వాది అని చెప్పారు. కొంతమంది లీడర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారని, నిన్నటి దాకా కేసీఆర్ పక్కన ఉన్నారని, నేడు జంప్ కొట్టారు కొడుకులు.. తీవ్ర విమర్శలు చేశారు. ఎందుకు జంప్ కొట్టారంటే.. యాడ ప్రభుత్వం ఉంటే ఆక్కడికి పోతారని విమర్శించారు. ఈ క్రమంలోనే ప్రజలు ఆలోచించి బీఆర్ఎస్‌కు ఓటువేయాలని సూచించారు.