- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తక్కెళ్లపల్లి కామెంట్లపై BRS సీరియస్.. పిలిచి మాట్లాడే యోచనలో గులాబీ బాస్
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ మధ్య బీఆర్ఎస్‌లో జరిగిన తప్పులను బహిర్గతం చేస్తూ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు చేసిన కామెంట్స్ ఆ పార్టీలో అలజడి రేపుతున్నాయి. రవీందర్ ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడి ఉంటారని అసెంబ్లీ లాబీలో ఎమ్మెల్యేలు ఆరా తీస్తూ కనిపించారు. వరంగల్ జిల్లాకు చెందిన లీడర్లను ఉద్దేశించి మాట్లాడారా? లేక మిగతా జిల్లాలకు చెందిన లీడర్లపై కామెంట్ చేశారా? అని చర్చించుకున్నారు. బ్రోకర్ బ్యాచ్‌కు ప్రయారిటీ ఇవ్వడం వల్లే పార్టీ ఓడిపోయిందని శుక్రవారం అసెంబ్లీలో తక్కెళ్లపల్లి హాట్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత ఆయన తను ఆలా మాట్లాడలేదని ఖండిస్తూ వివరణ ఇచ్చారు. కానీ రవీందర్ చేసిన కామెంట్స్ మాత్రం పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
నిజమే మాట్లాడారు
కాగా రవీందర్ రావు మాటల్లో నిజం ఉందని, కేవలం బ్రోకర్ బ్యాచ్ వల్లే పార్టీ నష్టపోయిందని మొదట్నించి పార్టీలో ఉన్న నాయకులు అభిప్రాయపడుతున్నారు. కేసీఆర్, కేటీఆర్ వలస లీడర్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో కొంప మునిగిన విషయాన్ని గుర్తించాలని ఇంటర్నల్ మీటింగ్‌లో మాట్లాడుకుంటున్నారు. అయితే వరంగల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వద్ద రవీందర్ చేసిన కామెంట్స్‌ను ప్రస్తావించగా, తనను ఉద్దేశించి చేయలేదని కొట్టిపారేసినట్టు ఆ జిల్లాకు చెందిన లీడర్లు వివరించారు.
ఈ మధ్య ఎమ్మెల్యేగా గెలిచి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఓ లీడర్ అసెంబ్లీలో కనిపించగానే ఓ మాజీ మంత్రి ‘అన్న రవీందర్‌తో ఎందుకు గొడవ పడుతున్నావు.. ఆయనతో నీకు ఏమైనా చెడిందా?’ అని ప్రస్తావించారు. దానికి సదరు ఎమ్మెల్యే ‘అతనో వేస్ట్ ఫెలో’ అని కామెంట్ చేసి, ఆ టాపిక్‌పై మాట్లాడేందుకు ఇష్టపడలేదు. అయితే రవీందర్‌ను త్వరలో సీఎం కేసీఆర్ పిలిచి మాట్లాడే చాన్స్ ఉన్నట్టు పార్టీలో ప్రచారం జరుగుతున్నది. అయితే రవీందర్ రావు కామెంట్స్ వల్ల నష్టం వచ్చినా వాస్తవాలు బయటికి వస్తున్నట్టు మెజార్టీ లీడర్లు అభిప్రాయపడుతున్నారు.