- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొడుతున్న బీఆర్ఎస్!
దిశ, తెలంగాణ బ్యూరో: గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ తన రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ వర్గాలను రెచ్చగొడుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వంపై కృత్రిమ ఆందోళనకు ప్లాన్ చేస్తుందని, ఈ వ్యవహారంలో గులాబీ లీడర్లు ఎంజాయ్ చేస్తుండగా, నిరసనలకు దిగిన వ్యక్తులే బలిపశువులుగా మిగిలిపోతున్నారని కామెంట్స్ వస్తున్నాయి. మరోవైపు ఏ రోజు ఏ వర్గంవారితో ప్రొటెస్ట్ చేయించాలి? ఏ ఏరియాలో ఆందోళనలు చేయాలి? ఆ పొగ్రామ్‌కు ఎంతమంది రావాలి? అనే పక్కా ప్లాన్‌తో గులాబీ టీమ్ ముందస్తు క్యాలెండర్ తయారు చేస్తూ, క్షేత్ర స్థాయి లీడర్లకు అప్పగిస్తుందనే చర్చ ఆ పార్టీ కేడర్‌లో నడుస్తోంది.
నాడు ఎంకరేజ్.. నేడు నో రెస్పాన్స్!
పాత సెలవుల విధానాన్ని పునరుద్ధరణ చేశాక కూడా ఒకే స్టేట్, ఒకే పోలిసింగ్ అనే నినాదంతో స్పెషల్ పోలీసులు అందోళనకు దిగారు. తమ భార్యపిల్లలతో రొడ్ల మీదకి వచ్చి నిరసనలు తెలిపారు. అలా చేయడం సర్వీస్ రూల్స్ కు విరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేసిన డీజీపీ సుమారు 39 మందిపై చర్యలు తీసుకున్నారు. అందులో కొందరు సస్పెండ్ అవ్వగా.. మిగతా పోలీసులు వెనక్కి తగ్గారు. కానీ ఈ ఆందోళనలను ప్రోత్సహించిన లీడర్లు మాత్రం ఇప్పుడు ఫోన్ చేసినా స్పందించడం లేదనే చర్చ జరుగుతున్నది. తిరిగి తమకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
సర్పంచుల వెనుక గులాబీ టీమ్..
ప్రభుత్వంలో ఉన్నప్పుడు బిల్లులు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టిన బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు మాజీ సర్పంచులను ఆందోళనకు దిగాలని ఒత్తిడి చేస్తున్నట్టు విమర్శలొస్తున్నాయి. అందుకోసం వివిధ గ్రామాలకు చెందిన మాజీ సర్పంచులకు నేరుగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రొటెస్ట్ చేయకపోతే బిల్లులు రావంటూ ఉసిగొల్పే ప్రయత్నాలు చేస్తున్నారని నిఘావర్గాలు గుర్తించినట్టు సమాచారం.
తాళాలకు మూలం గులాబీ లీడర్లే..
దసరా సెలవుల తర్వాత గురుకులాలకు వచ్చిన పిల్లలకు తాళాలు స్వాగతం పలికాయి. తమకు అద్దె బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బిల్డింగ్ ఓనర్లు తాళాలు వేశారు. పక్కా ప్లానింగ్‌తోనే ఈ కృత్రిమ ప్రొటెస్ట్‌కు బీఆర్ఎస్ లీడర్లు ప్లాన్ చేసినట్టు ఊహాగానాలు వినిపించాయి. మెజార్టీ అద్దె భవనాలు బీఆర్ఎస్ లీడర్లకు చెందినవనే ఆరోపణలున్నాయి. వారందరికీ ముందు రోజు ఫోన్లు చేసి, అందరూ ఒకేరోజు స్కూల్ గేట్లుకు తాళాలు వేయాలని గైడెన్స్ ఇచ్చినట్టు నిఘా వర్గాల విచారణలో తేలింది.
రైస్, జిన్నింగ్ మిల్లర్ల వెనక విపక్షం..
కొన్ని రోజులుగా వరి ధాన్యం సేకరణ విషయంలో మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.తేమ, నాణ్యత పేరుతో రైతులు పండించిన పంటకు తక్కువ ధర చెల్లిస్తున్నారు. దీనితో రైతులు ఆందోళనకు దిగారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లర్లు గులాబీ పార్టీకి చెందిన వారే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు రైస్ మిల్లర్లు పనిగట్టుకుని రైతులను ఇబ్బందిపెడుతున్నట్టు విమర్శలు వచ్చాయి. పత్తి కొనుగోళ్ల విషయంలో కూడా జిన్నింగ్ మిల్లర్ల ఓనర్లు రైతులను ఇబ్బంది పెడుతున్నట్లు సమాచారం. వీరి వెనుక కూడా బీఆర్ఎస్ లీడర్ల ప్రొత్సాహం ఉందని తెలుస్తోంది.
పార్టీకే డ్యామేజ్ అంటోన్న కేడర్..
కృత్రిమ ఆందోళన ద్వారా బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో చులకన అవుతుందని, భవిష్యత్‌లో పార్టీకి నష్టం కలిగిస్తుందనే చర్చ గులాబీ కేడర్‌లో జరుగుతోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కాలేదు. అప్పుడే నిరసనలు, ధర్నాలు చేయడం వల్ల ఉపయోగం ఉండదని ఎన్ని ప్రొటెస్టులు చేసినా, నాలుగేళ్ల తరువాతనే అసెంబ్లీకి ఎన్నికలు వస్తాయే తప్పా, ముందుగా జరగవని సొంత కేడర్ పెదవి విరుస్తోంది. మరికొంత కాలం కాంగ్రెస్ పాలకులకు సమయం ఇచ్చి ఆ తర్వాత ఆందోళనకు పిలుపు ఇవ్వాలని కొందరు నేతలు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.