రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పుల భారం మోపిన బీఆర్ఎస్ సర్కార్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

by Shiva |
రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పుల భారం మోపిన బీఆర్ఎస్ సర్కార్ : డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంపై బీఆర్ఎస్ సర్కార్ రూ.లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సమయంలో మిగులు బడ్జె‌ట్‌తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా మార్చారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే ప్రతిపక్షాలు ఉండాలని అన్నారు. అందుకే తాము అధికారంలోకి రాగానే ధర్నా చౌక్‌ను పునరుద్ధరించామని గుర్తు చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సర్కార్ రాష్ట్రంపై రూ.లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే రెండు హామీలను అమలు చేశామని, మరో రెండు హామీలను త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం నడుం బిగించిందిని పేర్కొన్నారు. ఈ మేరకు ఇప్పటికే టీఎస్‌పీ‌ఎస్‌సీ ప్రక్షళణ మొదలైందని అన్నారు.

Advertisement

Next Story