మళ్లీ టీఆర్ఎస్‌ గా మారబోతున్న బీఆర్ఎస్?

by Ramesh Goud |
మళ్లీ టీఆర్ఎస్‌ గా మారబోతున్న బీఆర్ఎస్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ మళ్లీ బీఆర్ఎస్ గా మారబోతుందా అనే దానిపై బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ మీడియా చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన పార్టీ పేరు మార్చడంపై పలు విషయాలు వెల్లడించారు. టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్చడం తమ పార్టీ క్యాడర్ లో 80 శాతం మందికి ఇష్టం లేదని, ఇటీవల పార్లమెంటరీ నియోజక వర్గాల వారిగా జరుపుతున్న రివ్యూ మీటింగ్స్ లో కార్యకర్తలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేసినట్లు వెల్లడించారు. మళ్లీ టీఆర్ఎస్ గా మార్చాలనే దానిపై న్యాయ సలహాలు తీసుకోవాల్సి ఉందని, మా కార్యకర్తలు తెలంగాణ పేరు పార్టీలో ఉండాలని కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ను టీఆర్ఎస్ గా మార్చడంపై లోక్ సభ ఎన్నికల అనంతరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

దీంతో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ టీఆర్ఎస్ గా మారనుందని, త్వరలోనే న్యాయ సలహ ద్వారా మార్చనున్నారనే వార్తలు ఊపందుకున్నాయి. గతంలో టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ పేరును దేశ రాజకీయాల్లో పాగా వేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ గా మార్చి పార్లమెంట్ ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేయనున్నామని ప్రకటించారు. పార్టీ పేరు మార్చినప్పటి నుండి బీఆర్ఎస్ కు వ్యతిరేఖ పవనాలు వీస్తున్నాయనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. బీఆర్ఎస్ దేశంలో పూర్తి స్థాయిలో బలోపేతం కాకపోగా.. సొంత రాష్ట్రంలోనే ఓడిపోవడం సహా పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయని పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తొంది. ఈ అంశం పార్టీలోని కొందరు కీలక నేతలు గులాబీ బాస్ కేసీఆర్ వద్దకు కూడా తీసుకెళ్లారని, దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed