- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడు BRS ఆవిర్భావ సభ.. 10 గంటలకు బేగంపేటకు CM KCR
దిశ, వెబ్ డెస్క్: నేడు ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ జరగనుంది. ఈ సభకు కేరళ సీఎం పినరయి విజయన్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లు హాజరుకానున్నారు. వీరితో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి డీ. రాజాలు సైతం బీఆర్ఎస్ కు సంఘీభావం తెలుపుతూ ఖమ్మం సభకు రానున్నారు. 100 ఎకరాల్లో 5లక్షల మందితో సభ నిర్వహణకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. సభకు 4,198 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఉ. 10 గంటలకు ప్రగతిభవన్ నుంచి బేగంపేట్ ఎయిర్ పోర్టుకు సీఎం కేసీఆర్ బయల్దేరనున్నారు. ఉ.10.30 గంటలకు యాదాద్రికి సీఎం కేసీఆర్ చేరుకుంటారు. కేసీఆర్‌తో పాటు యాదాద్రికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వెళ్లనున్నారు. అనంతరం పినరయి విజయన్, భగవంత్ మాన్ సింగ్, అఖిలేష్ యాదవ్‌లతో కలిసి 11.30 గంటలకు ఖమ్మంకు సీఎం వెళ్లనున్నారు. ఖమ్మంలో కంటివెలుగును సీఎం కేసీఆర్ అతిథులతో కలిసి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2.25 గంటలకు ఖమ్మం కలెక్టరేట్‌ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు వెంకటాయపాలెంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన కేసీఆర్ ఈ సభలో ఏం మాట్లాడతారనే విషయంలో ఆసక్తి నెలకొంది.
Also Read....