BRS: బీఆర్ఎస్ పై ఫేక్ వార్తలు.. ఆర్టీవీ, రవిప్రకాశ్ కు నోటీసులు

by Ramesh Goud |
BRS: బీఆర్ఎస్ పై ఫేక్ వార్తలు.. ఆర్టీవీ, రవిప్రకాశ్ కు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ ఫేక్ వార్తలు ప్రచురించినందుకు ఆర్టీవీ, రవి ప్రకాశ్ లకు బీఆర్ఎస్ ఐటీ విభాగం నోటీసులు పంపింది. ఈ వార్తలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయని, వెంటనే తొలగించాలని నోటీసులలో పేర్కొంది. కొద్ది రోజుల క్రితం బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అనే వార్తలు పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. దీనిపై బీఆర్ఎస్ ఐటీ విభాగం స్పందిస్తూ.. ఈ వార్తాలను కొట్టిపారేసింది. అంతేగాక ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ఆర్‌టీవీ, రవిప్రకాశ్ లకు పరువు నష్టం కింద నోటీసులు పంపింది. తప్పుడు వార్తలను వెంటనే తొలగించాలని పేర్కొంది. భారత రాష్ట్ర సమితి తెలంగాణ ఏర్పడిన తర్వాత అదికారంలో ఉన్న పదేళ్లు.. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ఎల్లప్పుడూ కేంద్రం ప్రభుత్వంతో విభేదిస్తూ వస్తోందని, బీజేపీతో విలీనం అవుతుందనడానికి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు చూపించలేదని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాక సామన్య ప్రజలను తీవ్ర గందరగోళంలోని నెట్టేశాయని, ఇది పార్టీ ఖ్యాతిని దెబ్బతీస్తోందని చెప్పింది. ఆర్టీవీ డిజిటల్ అండ్ ప్రింట్ మీడియాలలో పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేలా అబద్దపు ప్రచారాలు పదే పదే చూపించారని, ఇవి పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించాయని చెబుతూ వాటిని తక్షణమే తొలగించాలని నోటీసుల ద్వారా వెల్లడించింది.

Advertisement

Next Story