Deeksha Diwas : ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా ‘దీక్షా దివస్’ : కేటీఆర్

by Ramesh N |
Deeksha Diwas : ఈ నెల 29న తెలంగాణ వ్యాప్తంగా ‘దీక్షా దివస్’ : కేటీఆర్
X

దిశ, తెలంగాణ/ డైనమిక్ బ్యూరో: ఈ నెల 29వ తేదీన బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా (Deeksha Diwas) దీక్ష దివాస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఒక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో దీక్ష దివాస్‌ను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. (Telangana) తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర సాధనలో అత్యంత కీలకమైన ఘట్టంగా దీక్ష దివాస్ నిలుస్తోందని తెలిపారు. 2009, నవంబర్ 29వ తేదీన భారత రాష్ట్ర సమితి (అప్పటి టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ (KCR) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసి స్వరాష్ట్ర సాధనకు బలమైన పునాదులు వేసిందన్నారు.

దీక్షకు వెళ్లే ముందు తెలంగాణ వచ్చుడో - కేసీఆర్ సచ్చుడో అనే తెగింపుతో చేపట్టిన ఈ దీక్ష సబ్బండ వర్ణాల తెలంగాణ ప్రజలను ఏకం చేసిందని పేర్కొన్నారు. ఈ దీక్ష యావత్ భారత దేశ రాజకీయ వ్యవస్థను కదిలించి, చరిత్రలో తొలిసారి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్వయంగా ప్రకటన చేసేలా చేసి దశాబ్దాల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిందని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed