BRS: కాంగ్రెస్ ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం.. ఉద్యోగుల సస్పెన్షన్‌పై కేటీఆర్

by Ramesh Goud |
BRS: కాంగ్రెస్ ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం.. ఉద్యోగుల సస్పెన్షన్‌పై కేటీఆర్
X

దిశ, డైనమిక్ బ్యూరో:కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని, సస్పెండ్ చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఏఈవోలపై వేటు అని ఓ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కేటీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. పాపపు పాలనలో ప్రతి బిడ్డా ఆగమేనని, సామాన్యులతో మొదలు ప్రభుత్వ ఉద్యోగులు సైతం రోడ్ల పైకే వస్తున్నారని అన్నారు. అడ్డగోలు సాకులతో సస్పెన్షన్‌లు, హక్కులు అడిగితే వేటు వెయ్యడాలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు రాహుల్ ఎరుగు అంటూ.. ఉన్న ఉద్యోగాలను ఊడపీకుతున్న రేవంత్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. 165 ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణమని అన్నారు. బీఆర్ఎస్ అంటే ఉద్యోగుల సంక్షేమ ప్రభుత్వమని, కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వమని విమర్శలు చేశారు. నాడు, నేడు, ఎల్లప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, సస్పెండ్ చేసిన ఉద్యోగులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. అంతేగాక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed