Governor Tamilisai వ్యాఖ్యలపై BRS కౌంటర్ అటాక్

by GSrikanth |   ( Updated:2023-01-26 06:48:55.0  )
Governor Tamilisai వ్యాఖ్యలపై BRS కౌంటర్ అటాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెంలగాణలో రాజ్ భవన్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. రాజ్ భవన్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకాలేదు. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ జాతీయ జెండావిష్కరణ చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలుగులో ప్రసంగం ప్రారంభించిన గవర్నర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ పరోక్షంగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పని తీరుపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేసిన గవర్నర్.. కొందరికి ఫార్మ్ హౌస్‌లు కాదు అందరికీ ఫార్మ్‌లు కావాలని అన్నారు. తెలంగాణ తెలంగాణ గౌరవాన్ని నిలబెడదామని, తెలంగాణ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామన్నారు.

తెలంగాణతో నాకున్న అనుబంధం ముడేళ్లది కాదని ఇది పుట్టుకతో వచ్చిందన్నారు. తెలంగాణ అభివృద్ధిలో నా పాత్ర తప్పక ఉంటుందని చెప్పారు. కొందరికి నేను నచ్చకపోవచ్చు.. కానీ తెలంగాణ అంటే తనకు ఎంతో ఇష్టం అన్నారు. ఎంత కష్టం అయినా తెలంగాణ ప్రజల కోసం పని చేస్తానన్నారు. రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని నేషనల్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి రోజు రాష్ట్రంలో 22 ఆత్మహత్యలు జరుగుతున్నాయని తెలంగాణ యువత ధైర్యం తో ఉండాలని విజ్ఞప్తి చేశారు. సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే తెలుగు రాష్ట్రాలకు ప్రధాని మోడీ వందేభారత్ రైలును కేటాయించిన సంగతి గుర్తు చేశారు. గిరిజన ప్రాంతాల్లో రాజ్ భవన్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అంబేద్కర్ ఎంతో అంకిత భావం కనబరిచారు. ఆ రాజ్యంగం ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిందన్నారు. కాగా రాజ్ భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకలకు ప్రభుత్వ పెద్దలు హాజరు కాలేదు. ప్రోటోకాల్ ప్రకారం వేడుకలకు ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గోల్డెన్‌ గ్లోబ్స్ అవార్డు గెలుచుకున్న, ఆస్కార్‌లకు నామినేట్ అయిన 'నాటు నాటు' పాట స్వరకర్త మరియు గీత రచయిత ఎంఎం కీరవాణి, చంద్రబోస్‌లను గవర్నర్ తమిళిసై సత్కరించారు.

గవర్నర్ ప్రసంగంపై బీఆర్ఎస్ ఎటాక్:

కరోనా లాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ సెంట్రల్ విస్టా మీద కంటే, దేశ మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కానీ కేంద్రం మాత్రం కేవలం కొందరికి పెంపుపై మాత్రమే దృష్టి పెట్టింది. అలా కాకుండా రైతులు, కూలీలు, నిరుద్యోగ యువతను పట్టించుకోవడం కోసమే మేము పోరాటం చేస్తున్నామని, కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నారో అదే ఇవాళ గవర్నర్ తన ప్రసంగంలో అడిగినందుకు ధన్యవాదాలు. - ఎమ్మెల్సీ కవిత

బాధ్యతల్లో ఉన్న వాళ్లు తెలంగాణ అభివృద్ధిని గమనించకపోవడం బాధాకరం. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే వారు కేంద్రం ఏం చేసిందో కూడా చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం చేసిన పనులను గురించి అడిగితే కేవలం జాతీయ రహదారుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. - శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

Also Read....

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ రాజీనామాపై స్పందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Advertisement

Next Story