బిగ్ బ్రేకింగ్: వీ6 న్యూస్ ఛానల్, వెలుగు దిన పత్రికకు షాక్.. BRS హైకమాండ్ సంచలన నిర్ణయం!

by Satheesh |   ( Updated:2023-03-14 14:37:29.0  )
బిగ్ బ్రేకింగ్: వీ6 న్యూస్ ఛానల్, వెలుగు దిన పత్రికకు షాక్.. BRS హైకమాండ్ సంచలన నిర్ణయం!
X

దిశ, తెలంగాణబ్యూరో: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీస్తూ, బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలతో వీ-6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేసింది. ప్రజాస్వామ్యంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ బీజేపీకి జేబు సంస్థగా మారి అబద్ధాలు, అసత్యాలు, కట్టుకథలతో బీఆర్ఎస్ పార్టీ పైన, తెలంగాణ రాష్ట్రం పైన విషం చిమ్ముతుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశాలకు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ సంస్ధలు నిర్వహించే చర్చలతో సహా, ఎలాంటి కార్యక్రమాల్లోనూ పార్టీ ప్రతినిధులెవరూ పాల్గొనకూడదని ఆదేశించింది.



ఇవి కూడా చదవండి :

బ్రేకింగ్: సిట్‌కు చేరిన TSPSC పేపర్ల లీక్ కేసు దర్యాప్తు

Advertisement

Next Story