గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ ప్లాన్.. కేడర్‌కు హై కమాండ్ కీలక​ ఆదేశాలు..?

by Mahesh |
గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ భారీ ప్లాన్.. కేడర్‌కు హై కమాండ్ కీలక​ ఆదేశాలు..?
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎన్నికలు సమీపిస్తుండగా సర్కార్​ అలర్టైంది. బీఆర్ఎస్(టీఆర్ఎస్)హ్యాట్రిక్​కొట్టాలని పావులు కదుపుతున్నది. మెజార్టీ ప్రజల మైండ్ ను మార్చి ఓట్లు రాల్చుకోవాలని వ్యూహాలు పన్నుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందినోళ్లను టార్గెట్ చేసింది. ఓటర్​లిస్టును పరిశీలిస్తూ సర్కార్​నుంచి స్కీమ్ లు పొందిన లబ్ధిదారుల వివరాలను గుర్తించనుంది. ఏ స్కీమ్​నుంచి లబ్ధిపొందారు? ప్రభుత్వంపై వాళ్లకు ఉన్న ఆలోచన ఏమిటి? ఆ ఇంట్లో ఓటర్లు ఎందరు ఉన్నారు? వంటి వివరాలన్నింటినీ సేకరించనుంది.

ఇప్పటికే బీఆర్ఎస్​హై కమాండ్​నుంచి క్షేత్రస్థాయి లీడర్లకు ఆదేశాలు అందాయి. నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల వారీగా కమిటీలు వేయనుంది. ఇవి అన్ని స్కీముల లబ్ధిదారుల వివరాలు సేకరిస్తాయి. ఇప్పటికే వెల్ఫేర్, ఇతర డిపారెంట్ల ఆఫీసర్లకు డేటా అంశంపై సర్కార్ అంతర్గతంగా ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది. ప్రతి బెనిఫియర్​సామాజికవర్గం, ఫోన్ నంబర్లతో సహా రిపోర్టులు తయారు చేయనున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఓ బీఆర్​ఎస్ మండల ప్రెసిడెంట్ తెలిపారు.

మీకు మరింత మేలు ?

బెనిఫియర్లపై మరింత ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేయనున్నది. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్​కు ఓటు వేయాలని క్షేత్రస్థాయిలో కేడర్​కోరనున్నది. ఈసారి గెలిస్తే మీకు మరింత మేలు జరుగుతుందని..? స్కీమ్​లబ్ధిదారులకు సూచించనున్నారు. అవసరమైన పార్టీ పెద్దల నుంచి కూడా బెనిఫియర్లకు ఫోన్లు చేపించాలని పార్టీ ప్లాన్​చేసింది. దీనిలో భాగంగా జిల్లాకో టెలీ యూనిట్ టీమ్​లను ఎన్నికల కొరకు వాడనున్నారు. బీఆర్ఎస్​ఆఫీసులో వీళ్లకు ట్రైనింగ్ తో పాటు టాస్క్​నిమిత్తం ప్రత్యేక సౌకర్యాలను కూడా కల్పించనున్నారు.

సాయం ‘మిస్ కాకుండా..

ప్రభుత్వం నుంచి లబ్ధిపొందినోళ్లు తప్పనిసరిగా బీఆర్ఎస్ కు ఓటు వేస్తారనే భావనలో ప్రభుత్వం ఉన్నది. సాయం పొందినోళ్లు సర్కార్​కు అండగానే ఉంటారని ప్రభుత్వం ఫీల్ అవుతున్నది. అయితే పార్టీ నుంచి పదే పదే గుర్తు చేయడంతో బీఆర్ఎస్ గుర్తును మరిచిపోరనే భ్రమలో బీఆర్ఎస్​హై కమాండ్ ఆలోచిస్తున్నది. కల్యాణలక్ష్మి, ఆసరా, ఎంపర్​మెంట్, తదితర స్కీమ్​లు లబ్ధిదారులకు సర్కార్​నేరుగా ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది.

దీంతో పాటు యువత, నిరుద్యోగులను ఆకర్షించేందుకు కూడా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు బీఆర్ఎస్​ ఇన్ చార్జిలో ఒకరు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో బీఆర్ఎస్​అరవైకి పైగా సీట్లు సాధించగా, రెండో విడత ఎనభై కి పైగా.. మూడోసారి వంద సీట్లు టార్గెట్​గా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు సాగుతున్నది. అయితే ప్రభుత్వం వేసిన ఈ ప్లాన్​వర్కవుట్​అవుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.

Advertisement

Next Story