నేడు తమిళనాడుకు బీఆర్ఎస్ టీమ్.. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం

by Gantepaka Srikanth |
నేడు తమిళనాడుకు బీఆర్ఎస్ టీమ్.. బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీసీ రిజర్వేషన్ల అమలుపై అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ బీసీ నేతల బృందం నేడు తమిళనాడుకు బయలుదేరనుంది. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనా చారి, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో 25 మంది సభ్యుల టీమ్ తమిళనాడుకు వెళ్లనున్నది. గురువారం బీసీ సంక్షేమశాఖ మంత్రి, బీసీ కమిషన్ చైర్మన్, సెక్రటరీతో భేటీ కానున్నది. శుక్రవారం డీఎంకే ఆఫీసుకు వెళ్లి ఆ పార్టీ నేతలతో చర్చించనున్నది.

తమిళనాడులో విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థలల్లో బీసీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు, డీఎంకే పార్టీ నిర్మాణం, బీసీలకు ప్రాధాన్యం వంటి అంశాలపై బీఆర్ఎస్ బృందం అధ్యయనం చేసి పార్టీకి నివేదిక సమర్పించనున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ ఒత్తిడి పెంచాలని భావిస్తున్నది. దీంతో ఆ రాష్ట్ర వివరాలతో తయారు చేసిన నివేదికను ప్రభుత్వానికి సైతం అందజేయాలని భావిస్తున్నది.

Advertisement

Next Story