దేశానికి దిశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

by Sathputhe Rajesh |   ( Updated:2023-01-28 10:02:19.0  )
దేశానికి దిశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌: ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి
X

దిశ, కిన్వ‌ట్ : దేశానికి దిశ, దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, సీఎం కేసీఆర్‌తో క‌లిసి న‌డ‌వాల‌ని పిలుపునిచ్చారు. మ‌హారాష్ట్ర‌లో బీఆర్ఎస్ విస్త‌ర‌ణ‌, నాందేడ్ స‌భ స‌న్నాహ‌కాల్లో భాగంగా మంత్రి శ‌నివారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించారు.

కిన్వ‌ట్ తాలూకాలోని అప్పారావు పేట‌ గ్రామంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ప‌ర్య‌టించి, బీఆర్ఎస్ పార్టీ మ‌ద్ధ‌తుదారులను కలిసారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ.. ఫిబ్ర‌వ‌రి 5న‌ నాందేడ్‌లో నిర్వ‌హించ‌నున్న స‌భ‌కు పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు త‌ర‌లివ‌చ్చి బీఆర్ఎస్‌కు సంఘీభావం తెల‌పాల‌ని కోరారు. స‌భ‌కు ముందు నాందేడ్‌లోని సిక్కుల ప‌విత్ర స్థ‌లం గురుద్వార్‌ను సీఎం కేసీఆర్ ద‌ర్శించుకుంటార‌ని తెలిపారు. గ‌తంలో మ‌న‌మంద‌రం ఒకే రాష్ట్రంగా ఉన్నామ‌ని, దీంతో మ‌హారాష్ట్ర - తెలంగాణ రాష్ట్రాల‌కు మంచి సంబంధాలు ఉన్నాయ‌న్నారు.

తెలంగాణ ప్ర‌జ‌ల‌కు ర‌క్త సంబంధీకులు, బంధుత్వాలు ఇక్కడ ఉన్నాయ‌ని గుర్తు చేశారు. రాష్ట్రంలో అమ‌లు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ ప‌థ‌కాల ఫ‌లాలు దేశ వ్యాప్తంగా ప్ర‌తీ ఒక్క‌రికీ అమ‌లు చేయాల‌నే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించార‌న్నారని గుర్తుచేశారు. కేంద్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్‌ ప్రాధాన్యత పెరగనుందన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఇదే తరహా అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. అందుకే బీఆర్ఎస్‌లో చేరేందుకు పలువురు ఆసక్తి చూపిస్తున్నార‌ని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed