BREAKING : రుణమాఫీ వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. సొంత గూటికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

by Rajesh |   ( Updated:2024-07-30 07:39:27.0  )
BREAKING : రుణమాఫీ వేళ కాంగ్రెస్‌కు ఊహించని షాక్.. సొంత గూటికి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రెండో విడత రైతు రుణమాఫీ వేళ అధికార కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి మంగళవారం తిరిగి కారుపార్టీలో చేరారు. ఈ సందర్భంగా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి పార్టీలో కొనసాగుతా అని క్లారిటీ ఇచ్చారు. అనంతరం కేటీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. అసెంబ్లీ ప్రాంగణంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కూర్చుని సరదాగా మాట్లాడుతూ కనిపించారు.

ఓ వైపు అధికార కాంగ్రెస్ ‘ఆపరేషన్ ఆకర్ష్‌’తో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరిగా పార్టీలో చేర్చుకుంటుంగా ఈ ఊహించని పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో మొత్తం పది మంది ఎమ్మెల్యేలు చేరగా.. కృష్ణ మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోవడంతో ఈ సంఖ్య తొమ్మిదికి చేరింది. అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 75 నుంచి 74కు పడిపోయింది. కాంగ్రెస్‌లో చేరిన వారిలో అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, కడియం శ్రీహరి, పోచారం, డాక్టర్ సంజయ్, కాలేరు యాదయ్య, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డిలు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed